EPAPER

Kolkata doctor rape-murder: కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్టు .. ఏం తెలిసిందంటే?..

Kolkata doctor rape-murder: కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్టు .. ఏం తెలిసిందంటే?..

Kolkata doctor rape-murder: కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పై ఆదివారం పాలీగ్రాఫ్ టెస్టు(నిజ నిర్ధారణ పరీక్ష) నిర్వహించారు. ఈ టెస్టులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయని సిబిఐ అధికారులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినపుడు నిందితుడు సంజయ్ రాయ్ తను నిర్దోషి అని, తనకు ఏమీ తెలియదని న్యాయమూర్తి ముందు చెప్పాడు.


అయితే అతనిపై చేసిన లై డిక్టెటర్ టెస్ట్ (నిజ నిర్ధారణ పరీక్ష)లో అతను చాలా ప్రశ్నలక అబద్ధం చెప్పాడని, సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. మహిళా డాక్టర్ రేప్, హత్య కేసులో సంజయ్ రాయ్ ని లై డిక్టెటర్ టెస్ట్ చేసినప్పుడు.. నిందితుడు ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ ముందుగానే మహిళా డాక్టర్ శవం రక్తసిక్తమై పడి ఉందని చెప్పాడు. అక్కడ శవం చూసి తాను భయపడి అక్కడి నుంచి వెంటనే పారిపోయానని సమాధానమిచ్చాడు.

అయితే సంజయ్ రాయ్ టెస్టు చేస్తున్న సమయంలో చాలా కంగారుగా ఉన్నాడని తెలసింది. టెస్టు చేస్తున్న సమయంలో సంజయ్ రాయ్ సమాధానాలను సిబిఐ అధికారులు.. ఆధారాలు చూపిస్తూ ఎదురు ప్రశ్నలతో కౌంటర్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ద్వారా తెలిసింది.


మరోవైపు సిబిఐ అధికారులు విచారణ చేయక మందు కోల్‌కతా పోలీసులు ఈ కేసుని విచారణ చేశారు. వారి విచారణ సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ తాను నేరం చేసినట్లు అంగీకరించాడని చెప్పారు. అయితే సిబిఐ అధికారుల విచారణ సమయంలో మాత్రం తాను నిర్దోషి అని మాట మార్చాడు.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

డాక్టర్ హత్యాచారం కేసులో కొన్ని రోజులుగా జైలులో ఉన్న సంజయ్ రాయ్.. జైలులో గార్డులతో కూడా తనను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని చెప్పాడని తెలిసింది. గత శుక్రవారం ట్రయల్ కోర్టులో అడిషనట్ జడ్జి ముందు కూడా నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినని, తనకు ఏమీ తెలియదని వాంగ్మూలం ఇచ్చాడు.

అయితే పోలీసులు, సిబిఐ అధికారులు సంజయ్ రాయ్ విచారణను తప్పుదోవ పట్టించేందుకు.. రెండు వేర్వేరు వాంగ్మూలాలు ఇచ్చాడని చెప్పారు.

Also Read: ‘ఎవరైనా చనిపోతే స్కూలుకు సెలవు ఇస్తారని’.. అయిదేళ్ల పసివాడిని హత్య చేసిన విద్యార్థులు

మహిళా డాక్టర్ మరణించిన సమయంలోనే అక్కడికి సంజయ్ రాయ్ ఎందుకు వెళ్లాడని, అక్కడ అతని బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ ఎలా లభించాయని, ఘటన రోజు నిందితుడి ముఖానికి అయిన గాయాలు ఏ కారణంగా జరిగాయనే ప్రశ్నలకు సంజయ్ రాయ్ సంతృప్తికర సమాధానాలు చెప్పలేదు.

ఇంతకుముందు సిబిఐ అధికారులు సంజయ్ రాయ్ పై సైకో అనాలిటిక్ పరీక్ష చేశారు. అందులో సంజయ్ రాయ్ ది జంతువు లాంటి స్వభావం అని, కీచక ప్రవృత్తి కలవాడని, పోర్న్ వీడియోలు చూసే వ్యసనం అతనికి ఉందని పోలీసులు తెలిపారు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×