EPAPER

Rinku Singh: కోల్ కతా.. రింకూసింగ్ ని వదులుకుంటుందా?

Rinku Singh: కోల్ కతా.. రింకూసింగ్ ని వదులుకుంటుందా?

Rinku Singh Wants To Play For RCB In IPL 2025 If Not Retained By KKR In IPL Auction: ఐపీఎల్ 2025 సీజన్ కి వచ్చేసరికి, పది ఫ్రాంచైజీల్లో ఎన్నో మార్పులు-చేర్పులు కనిపించేలా ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ కూడా కేవలం ఐదుగురినే రిటైన్ చేసుకునే అవకాశాలు ఉండటంతో జట్టులో 14 మందిలో తొమ్మిదిమందికి ఉద్వాసన తప్పేలా లేదు. ఈ క్రమంలో ఎవరుంటారు? ఎవరిని ఫ్రాంచైజీలు వదులు కుంటాయనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.


ఈ నేపథ్యంలో కోల్ కతా  నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌ ని వదులుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఇండియన్ క్రికెట్ లో ఒక్కసారి తారా జువ్వలా ఎగిరిన రింకూ సింగ్ తర్వాత కాలంలో  నిలదొక్కుకోలేక సతమతమయ్యాడు. నిజానికి ఏడో నెంబర్ బ్యాటర్ గా వచ్చి, ధోనీలా బెస్ట్ ఫినిషర్ గా మారతాడని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ ఇచ్చిన అవకాశాలను వృధా చేసుకున్నాడనే చెప్పాలి.

ఐపీఎల్ మెగా వేలానికి ముందు కోల్ కతా నుంచి బయటకు వచ్చే వారి పేర్లలో రింకూ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే విషయమై రింకూ  మాట్లాడుతూ ఒకవేళ అదే జరిగితే, నేను ఆర్బీసీకి వెళతాను. కొహ్లీతో కలిసి ఆడాలని ఉందన్నాడు. అంటే తను కూడా మెంటల్ గా డిసైడ్ అయ్యాడని అంటున్నారు.


ఐపీఎల్ 2024 టైటిల్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. అయితే విన్నింగ్ టీమ్ లో ఉండి కూడా రింకూ సింగ్ అంతగా ఆకట్టుకోలేదు. 11 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 168 పరుగులే చేశాడు. కానీ 2023 ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా ఆడి 474 పరుగులు చేశాడు.

Also Read: యూఎస్ ఓపెన్.. టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్, అల్కరాస్..

మరోవైపు శివమ్ దూబే కారణంగా రింకూ సింగ్ దారులు మూసుకుపోయాయి. ఎందుకంటే ఐపీఎల్ 2024 లో తను చెలరేగి ఆడాడు. అంతేకాదు ఆల్ రౌండర్ కూడా కావడంతో సెలక్టర్లు.. దూబే వైపే మొగ్గు చూపారు. టీ 20 ప్రపంచకప్ కి ఎంపిక చేశారు. రింకూని రిజర్వ్ ప్లేయర్ గా ఉంచేశారు.

ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో రింకూ సింగ్ కి దులీఫ్ ట్రోఫీలో కూడా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్ మాట్లాడుతూ గత సీజన్ లో సరిగ్గా పరుగులు చేయకపోవడం వల్లే, దులీఫ్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని అన్నాడు. అయితే తప్పనిసరిగా రెండో రౌండుకి ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపాడు. ఈలోపు రింకూ మరింత ప్రాక్టీస్ చేసి, ఎప్పటిలా మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఆశిద్దాం.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×