EPAPER

US open: యూఎస్ ఓపెన్.. టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్, అల్కరాస్..

US open: యూఎస్ ఓపెన్.. టైటిల్‌పై  కన్నేసిన జకోవిచ్, అల్కరాస్..

US open: కొద్దిగంటల్లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మొదలుకానుంది. ఈసారి హేమాహేమీలు పోరుకు సిద్ధమవుతున్నారు. సిన్నర్, జకోవిచ్, అల్కరాస్ తోపాటు మరికొందరు ఆటగాళ్లు తమతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టైటిల్‌పై కన్నేశారు సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్, స్పెయిన్ యంగ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్.


సోమవారం నుంచి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మొదలుకానుంది. ప్రపంచ నెంబర్ టు క్రీడాకారుడు, సెర్బియా ఆటగాడు నవొక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేశాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సొంతం చేసుకున్న జకోవిచ్, అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. యూఎస్ ఓపెన్ గెలిస్తే.. 25గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు.


ALSO READ: తడబడిన సఫారీ జట్టు, రెండో మ్యాచ్‌లో విండీస్ గెలుపు.. సిరీస్ కైవసం..

నాలుగు సార్లు అమెరికా ఓపెన్‌ 2011, 2015, 2018, 2023 ఏడాదిల్లో టైటిళ్లను గెలుచుకున్నాడు జకోవిచ్. వరుసగా యూఎస్ ఓపెన్ గెలిచిన సందర్భం లేదు. కాకపోతే స్పెయిన్ యంగ్ ప్లేయర్ అల్కరాస్, ఇటలీ ఆటగాడు సిన్నర్ నుంచి జకోవిచ్‌కు గట్టి పోటీ నెలకొంది. వీరిపై విజయం సాధిస్తే జకోవిచ్‌కు ఎదురు ఉండదన్నది టెన్నిస్ అభిమానుల మాట.

స్పెయిన్ యంగ్ ప్లేయర్ అల్కరాస్ విషయానికొద్దాం. 21 ఏళ్ల అల్కరాస్, ఈ ఏడాది వరుసగా ఫ్రెంచ్, వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకుని మాంచి జోరు మీదున్నాడు. పారిస్ ఒలింపిక్స్ రజతం సొంతం చేసుకున్నాడు. ఇదే జోరు కొనసాగించాలని అల్కరాస్ భావిస్తున్నాడు. అన్నట్లు రెండేళ్ల కిందట యూఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు ఈ స్పెయిన్ బుల్.

మూడో గ్రాడ్ స్లామ్ టైటిల్ పై కన్నేసిన అల్కారస్, ప్రాక్టీసులో ఇబ్బందిపడ్డాడు. అతడి కాలి చీలిమండ బెణికింది. ఈ క్రమంలో ప్రాక్టీసును నిలిపివేసి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతానికి బాగానే ఉందని చెబుతున్నాడు.

ప్రపంచ నెంబర్ వన్.. ఇటలీ ఆటగాడు సిన్నర్. ఇతగాడు కూడా టైటిల్‌పై కన్నేశాడు. ఇప్పటివరకు ఐదుసార్లు యూఎస్ ఓపెన్ ఆడిన సిన్నర్, క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకు వెళ్లలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు.

ఫ్రెంచ్, వింబుల్డన్ మాత్రం సెమీస్ వరకు చేరుకున్నాడు సిన్నర్. జకోవిచ్‌కు సిన్నర్ నుంచి గట్టి పోటీ నెలకొంది. గాయాలతో పారిస్ ఒలింపిక్స్‌కు దూరమైన  సిన్నర్, ఈసారి ఎలాగైనా టెటిల్ సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరు గెలిచినా అదొక రికార్డు.

 

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×