ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

రన్నింగ్ వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి రన్నింగ్ గొప్ప మార్గం. ఊబకాయం ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది

రన్నింగ్ రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపోటును ప్రేరేపించే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రన్నింగ్‌  శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక బలాన్ని పెంచుతుంది.

రన్నింగ్ భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తిని రెట్టింపు చేసే సామ‌ర్థ్యం ర‌న్నింగ్ ఉంది.

రన్నింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్త పోటు  వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

రోజు ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు పరిగెత్త‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. అద‌న‌పు కేల‌రీలు వేగంగా బ‌ర్న్ అవుతాయి.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం త‌గ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.