తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం తినాలి..?

ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. దీని ద్వారా తిమ్మిర్లు ఏర్పడకుండా నివారిస్తుంది.

వెల్లుల్లి సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండటంతో రక్తప్రసరణ మెరుగై తిమ్మిర్లు రాకుండా అడ్డుకుంటాయి.

ద్రాక్ష పండ్లలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగుపరిచి తిమ్మిర్లు రాకుండా చేస్తాయి

ఇందులో కూడా కాల్షియం, నైట్రేట్స్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి తిమ్మిర్లు రాకుండా చేస్తాయి

గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, చియా సీడ్స్ కూడా రక్తప్రసరణను మెరుగుపరిచి తిమ్మిర్లు రాకుండా చేస్తాయి

నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయి. అదేవిధంగా రక్తప్రసరణను మెరుగుపరిచి తిమ్మిర్లు రాకుండా చేస్తాయి

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న చేపలను తినాలి. దీంతో రక్తపోటు అదుపులో ఉంచుతాయి. అదేవిధంగా రక్తప్రసరణ మెరుగై తిమ్మిర్లు రావు