EPAPER

Carrot Face Pack: ఒక్కసారి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మీ ముఖం మిలమిలా మెరిసిపోద్ది

Carrot Face Pack: ఒక్కసారి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మీ ముఖం మిలమిలా మెరిసిపోద్ది

Carrot Face Pack: అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖం కాంతి వంతంగా మెరిసిపోవాలని కొంత మంది బయట దొరికే ఫేస్‌క్రీమ్‌లు, ఫేస్‌ప్యాక్‌లను వాడుతుంటారు. వీటి వల్ల అప్పటికప్పుడు తాత్కాలికంగా అందంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత మామూలైపోతుంది. కొన్ని సార్లు ఎన్ని క్రీముల వాడినా స్కిన్ మాత్రం డల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో బయట దొరికే ప్రొడక్ట్స్ వాడకుండా సహజ సిద్ధంగా చర్మం మెరవడం కోసం క్యారెట్ ఫేస్ ప్యాక్‌ను ట్రై చేయండి. దీని వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.


తరుచుగా ఫేస్‌కు క్యారెట్ ఫేస్ ప్యాక్ వాడితే మీ చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది.
క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. కానీ క్యారెట్ పేస్టుతో ముఖానికి  కూడా మెరిసేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు తొలగిపోతాయని అంటున్నారు. మరి ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ఫేస్ ప్యాక్‌లు..


1. క్యారెట్, బొప్పాయి ఫేస్ ప్యాక్: ముందుగా 2 చిన్న క్యారెట్‌‌లను తీసుకుని వాటిని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి రసం కలపాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమంలో కొద్దిగా శనగపిండి, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫేస్‌కి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవడం వల్ల ఫేస్ మెరిసిపోతుంది.

2. క్యారెట్, తేనె ఫేస్ ప్యాక్:  అరకప్పు క్యారెట్ పేస్టులో ఒకటి స్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌తో పాటు చేతులకు కూడా ప్లే చేయండి. 10 నిమిషాల తర్వాత దీనిని చల్లని నీటితో క్లీన్ చేసుకోండి. రిజల్ట్ మీరే చూసి ఆశ్చర్యపోతారు.

3. క్యారెట్, దోసకాయ ఫేస్ ప్యాక్:  ఒక సగం కప్పు క్యారెట్ ముక్కలు, సగం కప్పు దోసకాయ ముక్కలను మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టీ స్పూన్ తేనె కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

4. క్యారెట్, పెరుగు ఫేస్ ప్యాక్:  క్యారెట్ పేస్ట్‌లో కాస్త పుల్లటి పెరుగును కలపండి . ఆ తర్వాత ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. చల్లటి నీటితో 20 నిమిషాల తర్వాత దీనిని కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

Also Read: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు మాయం

5. క్యారెట్, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:  అరకప్పు క్యారెట్ పేస్టు, ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టినిత తీసుకుని అందులో కొద్దిగా పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్యారెట్‌తో సారితో వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల చర్మం అందంగా మెరిసిపోతుంది. ఇలా కాకుండా ఆహారంలో భాగంగా క్యారెట్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×