EPAPER

2024 Hero Glamour 125: సరికొత్త కలర్ వేరియంట్‌లో ‘2024 హీరో గ్లామర్ 125’ లాంచ్.. ధర ఎంతంటే..?

2024 Hero Glamour 125: సరికొత్త కలర్ వేరియంట్‌లో ‘2024 హీరో గ్లామర్ 125’ లాంచ్.. ధర ఎంతంటే..?

2024 Hero Glamour 125  Launched: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన వాహనాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘గ్లామర్ 125’ బైక్‌కి విపరీతమైన ప్రజాదరణ లభించింది. ఇక లేటెస్ట్‌గా కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ‘గ్లామర్ 125’ బైక్‌లో మార్పులు చేర్పులు చేసి తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. 2024 గ్లామర్ 125 బైక్‌ను సరికొత్త ఫీచర్లతో కంపెనీ విడుదల చేసింది.


ఈ బైక్‌ను కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లలో తీసుకువచ్చింది. ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 2024 గ్లామర్ 125 బైక్‌లో హెడ్‌ల్యాంప్స్ ఇంతకముందుకంటే ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే కొత్త హెడ్‌లైట్ అందించారు. ఇది రైడర్‌కి స్పష్టమైన కాంతిని అందిస్తుంది. ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కన్సోల్ అందించారు. కాగా ఫ్యూయల్ శక్తిని మరింత మెరుగుపరచేందుకు కంపెనీ ఐ3ఎస్ సిస్టమ్ లేదా ఆటో స్టార్ట్/ స్టాప్ స్విచ్ వంటి ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా బైక్ కీని ఉపయోగించకుండానే బైక్‌ని ఆఫ్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

Also Read: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 250 కి.మీ మైలేజ్.. ధర మాత్రం అస్సలు ఊహించలేరు..!


అలాగే ఇందులో యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్‌ను అందించారు. ఈ బైక్‌లో హజార్డ్ లైట్లు కూడా అందించారు. అయితే ఈ ఫీచర్ ప్రాముఖ్యత ఏంటంటే.. ప్రమాదాల గురించి రౌడర్లను అలెర్ట్ చేస్తుంది. అంతేకాదండోయ్ మంచు కొండలు, భారీ వర్షాలలో కూడా ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కాగా ఈ బైక్‌ కొత్త కలర్.. అలాగే పాత కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. కంపెనీ ఈ 2024 గ్లామర్ 125 బైక్‌ని కొత్తగా బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీమ్‌తో అందించింది.

అదే సమయంలో దీని పాత కలర్‌ల విషయానికొస్తే.. క్యాండీ బ్లేజింగ్ రెడ్.. బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ టెక్నో బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 125 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 10.72 బిహెచ్‌పి పవర్, 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. అలాగే టాప్ అండ్ హై వేరియంట్‌లో ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్ అందించారు. ఇక ఎంట్రీ లెవల్ వేరియంట్లో డ్యూయల్ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇక ఈ బైక్‌లో 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అమర్చారు. చివరిగా ఈ కొత్త బైక్ ధరల విషయానికొస్తే.. ఈ బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ను రూ.83,598 ఎక్స్ షోరూమ్ ధరతో కంపెనీ తీసుకొచ్చింది. అదే సమయంలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.87,598 ఎక్స్ షోరూమ్ ధరతో వచ్చింది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×