EPAPER

KL Rahul: అప్పుడే రిటైర్మెంటా? అదంతా ఫేక్: కేఎల్ రాహుల్

KL Rahul: అప్పుడే రిటైర్మెంటా? అదంతా ఫేక్: కేఎల్ రాహుల్

KL Rahul is on his Retirement: టీమిండియా కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ ఎట్టకేలకు నోరు తెరిచాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశాడు. ఎవరు ఇలాంటివి షేర్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. నిఖిల్ కామ‌త్ అనే యూట్యూబ‌ర్‌తో మాట్లాడిన రాహుల్.. తన రిటైర్మెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.


అసలే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై జనం షాక్ నుంచి కోలుకోలేదు. అలాంటిది ఒకేరోజు ఇద్దరు ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ అనేసరికి అభిమానుల గుండెలు పగిలాయి. మొత్తానికి కేఎల్ రాహుల్ స్పందించాడు. అసలు విషయం చెప్పాడు.

నేనేమీ రిటైర్మెంట్ ప్రకటించలేదు, వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేశాడు. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఈ రిటైర్మెంట్ కూడా అలాంటి భయాన్నే కల్పించిదని అన్నాడు. ఇంతకీ ఏమిటా సంఘటన అంటే.. 2019లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంకి హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ కూడా వెళ్లాడు.


Also Read: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు

అయితే.. ఇద్దరూ ఆడవాళ్లని కించపరిచేలా మాట్లాడారు. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది. ఇద్దరిని కొన్ని రోజులు సస్పెండ్ చేసింది. తర్వాత వివాదం సద్దుమణిగింది. కానీ ఆ ఘటన నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉందని అన్నాడు. అది మళ్లీ గుర్తు వచ్చి భయపెట్టిందని రాహుల్ అన్నాడు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం నుంచి చాలా నేర్చుకున్నానని, జీవితం విలువ తెలిసిందని అన్నాడు.

నా జీవితంలో ఎప్పుడూ సస్పెండ్ కాలేదు. అంటే స్కూల్, కాలేజ్ ఇలా ఎక్కడా కూడా కానీ బీసీసీఐ సస్పెండ్ చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఆ ఒక్క ఇంటర్వ్యూ కారణంగా భారత జట్టులో స్థానం కోల్పోయాను. అప్పుడు మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపాడు. మళ్లీ ఆ రోజులు ఇప్పుడు గుర్తొచ్చాయని అన్నాడు.

అయితే.. యోగా లాంటివి సాధన చేశాను. అలా నెగిటివ్ ను పాజిటివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి వివాదాలకు చాలా దూరంగా ఉంటున్నాను. కానీ ట్రోలింగ్ లు మాత్రం ఆగలేదని అన్నాడు. త్వర‌లో జ‌రగబోయే దులీప్ ట్రోఫీలో పరుగులు చేసి, తనేమిటో నిరూపించుకోవాలని నెట్స్ లో కఠిన సాధన చేస్తున్నాడు. రాహుల్ మళ్లీ ఫామ్ ని అందుకోవాలని మనం కూడా కోరుకుందాం.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×