EPAPER

Kolkata Rape Case: కోల్ కతా హత్యాచారం కేసులో కొత్తగా ఐదుగురు ? వారిపై సీబీఐకి అనుమానం ఎందుకు ?

Kolkata Rape Case: కోల్ కతా హత్యాచారం కేసులో కొత్తగా ఐదుగురు ? వారిపై సీబీఐకి అనుమానం ఎందుకు ?

Kolkata Rape Case: కోల్‌కతా హత్యాచార బాధితురాలి కేసులో విచారణ కాస్త స్పీడప్ అయ్యింది. ఓ వైపు బాధితురాలి పేరెంట్స్‌ న్యాయం జరగడానికి ఇంకేంత సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఆందోళన కంటిన్యూ అవుతోంది. మరోవైపు సీబీఐ ఈ కేసు విచారణను సీబీఐ స్పీడప్‌ చేసింది. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సంజయ్ రాయ్, సందీప్‌ ఘోష్‌తో పాటు.. మరో ఐదుగురికి కూడా పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి. ఇంతకీ వారెవరు? వారికి ఈ కేసుకు సంబంధమేంటి? సంజయ్ రాయ్‌ కుటుంబ సభ్యుల రియాక్షనేంటి?


ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. ఆర్జీ కర్‌ హాస్పిటల్‌ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌లు నిర్వహించింది సీబీఐ. కానీ.. మరో ఐదుగురికి కూడా టెస్ట్‌లు నిర్వహించేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఈ ఐదుగురు ఎవరంటే నలుగురు జూనియర్ డాక్టర్లు.. సంజయ్ రాయ్‌ లాంటి మరో సివిక్ వాలంటీర్. సీబీఐ వీరిపై ఎందుకు ఫోకస్ చేసింది? వారిని విచారించి సమాచారాన్ని సేకరించకుండా టెస్ట్‌లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం.. తలాతోక లేకుండా మాట్లాడుతున్న వారిలో సంజయ్, సందీప్‌ మాత్రమే గాకుండా.. ఈ నలుగురు జూనియర్ డాక్టర్లు, సివిక్ వాలంటీర్ కూడా ఉన్నారు. ఈ ఐదుగురు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ అస్సలు సరిపోవడం లేదు. వీరంతా ఈ దారుణం జరిగిన రోజు ఆ పరిసరాల్లోనే ఉన్నారు. కానీ ఒక్కొక్కరి స్టేట్‌మెంట్‌ ఒక్కోలా ఉంది. దీంతో వీరు ఏదో దాస్తున్నారన్న అనుమానం సీబీఐ అధికారులకు వచ్చింది. అంతేకాదు సాక్ష్యాలను చెరిపేయడంలో వీరి హస్తం ఉందా? అనే అనుమానం కూడా అధికారులకు వచ్చింది. అందుకే మొత్తం ఏడుగురికి పాలిగ్రాఫ్‌ టేస్ట్‌లు చేసేందుకు అనుమతి తీసుకుంది.


Also Read: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ బాడీ వద్ద చిరిగిన డైరీ.. అందులో ఏముందంటే ?

మరో వైపు ఆర్‌జీ కర్‌ హాస్పిటల్ ఆర్థిక అవకతవకలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్ దర్యాప్తు చేసింది.. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సీబీఐకు అందించింది SIT. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న డాక్టర్లు, నర్సుల సంఖ్య ఎంతో తెలుసా? 18. అవును.. మొత్తం 18 మందిని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. అయితే వీరందరిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. వీరంతా ఘటన జరిగిన రోజు నుంచి కనపడకుండా పోయారని.. అయితే వీరంతా పోలీసులు, సీబీఐకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆర్‌ కర్ హాస్పిటల్‌ ఔట్‌పోస్ట్‌లో ఉన్న పోలీసులను కూడా ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది.

ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్ జరిగింది. నిజానికి ఇది డెవలప్‌మెంట్ అనే కంటే.. ట్విస్ట్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ దారుణం చేసింది నేనే.. కావాలంటే ఉరి తీసుకొండి అంటూ ప్రకటించిన సంజయ్ రాయ్.. కోర్టులో జడ్జి ముందు ఏడ్చేశాడు. తాను అమాయకుడి అని.. తనకు ఏ పాపం తెలియదంటున్నాడు. అంతేకాదు తనను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారంటున్నారు. నిజానికి సంజయ్‌లో ఇంత మార్పు చూసి అంతా షాక్ అయ్యారు. సంజయ్ నేరాన్ని అంగీకరించినట్టు ఇటు బెంగాల్ పోలీసులు, అటు సీబీఐ అధికారులు తెలిపారు.

Also Read: ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పిన నిందితుడు.. మరీ ఇంత సైకోనా అంటూ విస్తుపోయిన సీబీఐ అధికారులు

ఇక కోల్‌కతా హత్యాచారంపై నిందితుడు సంజయ్ రాయ్ సిస్టర్ స్పందించింది. గడచిని 17 ఏళ్లుగా అసలు సంజయ్‌తో తనకు సంబంధాలు లేవని చెబుతోంది ఆమె. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు తనతో ఎవరూ మాట్లాడరంటోంది. బట్ సంజయ్ చిన్నప్పుడు అందరి పిల్లల్లానే ఉండేవాడని.. పెద్దయ్యాక సివిక్‌ వాలంటీర్‌గా చేరాడు.. అక్కడ కూడా ఎలాంటి గొడవలు పెట్టుకున్నట్టు తెలీదన్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది సంజయే అనే విషయం ఇంకా తేలలేదు. కానీ ఒకవేళ చేసింది మాత్రం తనే అయితే తనకు ఎలాంటి శిక్ష విధించిన తప్పు లేదంటోంది. ఎవరైనా ఓ ఆడపిల్లతో ఇంత దారుణంగా బిహేవ్‌ చేస్తే శిక్షించండంలో తప్పే లేదంటోంది ఆమె.

మొత్తానికైతే విచారణ ప్రస్తుతానికి వేగంగానే జరుగుతోంది. అదే సమయంలో ఈ అంశంలో రాజకీయం కూడా జోరుగానే జరుగుతోంది. తృణమూల్ నేతలంతా బాల్‌ను సీబీఐ కోర్టులోకి తోసేస్తున్నారు. చేయాల్సిందంతా సీబీఐనే అని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నుంచి గల్లీ లీడర్‌ వరకు చెబుతున్నారు. ఇప్పుడు సీబీఐపై ప్రెజర్ పెరిగిపోయింది. మరోవైపు జూనియర్ డాక్టర్లు ఆందోళనను విరమించి విధుల్లో చేరాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సామాన్య రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరి దీనిపై డాక్టర్లు ఎలా స్పందిస్తారనేది చూడాలి.

Related News

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

Big Stories

×