Saripodhaa Sanivaaram Promotional Song released: టాలీవుడ్ యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని నటించినే లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం.’ ఈ సినిమాకు వివేవ్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది.
‘సరిపోదా శనివారం’ నుంచి ‘సరిమప’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నాని, ప్రియాంక అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ కు మంచి క్లాస్ మెలోడీగా రాకింగ్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో నటిస్తుండగా..జేక్స్ బిజయా సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్టు 29న తెలుగు, తమిళంచ కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
Presenting the soothing and vibing promotional song #Sarimapa ❤️❤️
Let’s keep rolling in its magical notes 😍#SaripodhaaSanivaaram pic.twitter.com/ns4KPt61Us
— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2024