EPAPER

Paracetamol: ఇక.. ఆ మందులు బంద్

Paracetamol: ఇక.. ఆ మందులు బంద్

– 156 రకాల మందులపై కేంద్రం బ్యాన్
– కాక్‌టెయిల్ డ్రగ్స్ వాడటంతో ప్రమాదంలో ఆరోగ్యం
– నిషేధిత జాబితాలో పారాసిటమాల్, ఎసెక్లోఫెనాక్
– ఈ మందులు నిల్వ చేయటం, అమ్మటం ఇక నేరమే
– డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ సిఫార్సు మేరకే నిర్ణయం
– మరో 34 మందులనూ నిషేధించే యోచనలో కేంద్రం


Drugs: దేశవ్యాప్తంగా చిన్నాచితకా అనారోగ్యాల కోసం వాడే 156 రకాల మందులను కేంద్రం నిషేధించింది. డాక్టర్ల సిఫారసుతో పనిలేకుండా నేరుగా మందులషాపుల నుంచి ఈ మందులు కొని వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు వాడుతున్న ఈ మందులకు బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు వాడాలని కేంద్రం సూచించింది. ఇలాంటి ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడమంటే ఆరోగ్యాన్ని పణంగా పెట్టటమేనని పేర్కొంటూ ఒక గెజిట్‌ నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26A కింద నిషేధం జారీ చేశారు. హానికరం లేదా అనవసరమైన ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అనుమతిస్తుంది. కాగా, ప్రస్తుతం నిషేధానికి గురైన వాటిలో మెజారిటీ కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ కావటం గమనార్హం.

కాక్‌టెయిల్ డ్రగ్స్ అంటే..
రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీలక ఔషధ పదార్థాలు నిర్దిష్ట నిష్పత్తిలో ఉండే మందులను ఎఫ్‌డీసీ మందులు అంటారు. వీటినే కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అని కూడా పిలుస్తారు. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ ఇంజెక్షన్, సెట్రిజెన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలను అధ్యయనం చేసి, ఇవి అహేతుకమైనవని చెప్పిందని ఈ నోటిఫికేషన్‌ పేర్కొంది.


విచారణ చేపట్టిన డీటీఏబీ
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) ఈ ఎఫ్‌డీసీ పరిశోధనను సిఫార్సు చేసింది. ఎఫ్‌డీసీ మానవులకు చాలా ప్రమాదకరమైనది. అందువల్ల, దాని అమ్మకం లేదా పంపిణీ నియంత్రించడం ముఖ్యం. గత సంవత్సరం, జూన్ 2023లో, 14 ఎఫ్‌డీసీ మందులను నిషేధించింది కేంద్రం. దాదాపు ప్రస్తుతం 344 ఔషధ కలయికలలో ఎఫ్‌డీసీ ఉన్నట్లు సమాచారం. 2016లో 344 మందుల పంపిణీ, విక్రయాలపై నిషేధం విధించారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రకారం, శాస్త్రీయ డేటా లేకుండా రోగులకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది.

Also Read: Sheethal Thampi: షూటింగ్ లో ప్రమాదం.. హీరోయిన్ రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నటి

మరో 34 మందులపైనా…నజర్
ఆరోగ్యానికి ముప్పుతెచ్చే కారణముందని 34 రకాల మల్టీవిటమిన్ ఔషధాలను నిషేధించే యోచనలో కేంద్రం ఉంది. ఆ ఔషధాలను నిషేధించేందుకు సమీక్ష నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రాలు ఇకపై డ్రగ్ కాంబినేషన్‌ను ఆమెదించలేవని వెల్లడించాయి. నిషేధిత ఔషధాల జాబితాలో జుట్టు చికిత్సకు వాడే మందులు, యాంటీపారాసిటిక్ ప్రయోజనాలకు వాడేవి, చర్మ సంరక్షణ, యాంటీ అలెర్టీ మందులు ఉన్నాయి.

నేరుగా కొంటున్నారు..
ఈ నిషేధానికి గురైన మందులను దేశవ్యాప్తంగా పలువురు డాక్టర్ సలహాతో నిమిత్తం లేకుండా నేరుగా మందుల షాపుల నుంచి కొని వాడి, కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారని, దీనిపై పదేపదే నిపుణులు, ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవటంలేదని కేంద్రం పరిశీలనలో తేలింది. దీంతో వీటిని నిషేధించామని, మందులు దుకాణాల్లో కూడా వీటి నిల్వలు లేకుండా చూడాలని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజల్లో కూడా వీటి వినియోగంపై అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని స్థానిక ప్రభుత్వాలకు సూచించారు.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×