EPAPER

Gajjela Kantham: బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు తోడు దొంగలు: గజ్జెల కాంతం

Gajjela Kantham: బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరు తోడు దొంగలు: గజ్జెల కాంతం

Gajjela Kantham Comments on BRS: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 2,500 చెరువులను ఆక్రమిచుకున్నారు. రూ. వందల కోట్లు తీసుకుని అక్రమార్కులకు దారాదత్తం చేశారు. దాంట్లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు. కాంగ్రెస్ 25లక్షల భూములను పేదలకు పంచితే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 16 వేల ఎకరాలను దళారులకు కట్ట బెట్టాడు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలు కూల్చి వేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎన్ కన్వెన్షన్ ను కూల్చారు. నాది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే మంత్రి పొంగులేటి కూల్చామన్నారు.


Also Read: పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా? : రఘునందన్ రావు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి దమ్మున్న మంత్రి. మీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా ఉన్నారా? వాటి మీద విచారణ జరుగుతున్నవి. కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని కేటీఆర్, హరీష్‌రావులు అంటున్నారు. అప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు. బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు తోడు దొంగలు. అధికారం కోల్పోయి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. గత బీఆర్ఎస్ అక్రమ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేపిస్తున్నాడు. పార్టీలు ఎవరైనా సరే చెరువులలో, కుంటలలో కట్టిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తుంది. లక్ష రూపాయల ఋణమాఫీ నాలుగు సార్లు చేస్తే అది రైతుల మిత్తికి సరిపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఋణమాఫీ చేస్తే, రైతులు సంబరాలు చేసుకున్నారు’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×