EPAPER

Akkineni Nagarjuna: సౌత్ లోనే రిచ్చెస్ట్ హీరో నాగార్జున.. ఆయన నికర ఆస్తుల విలువ ఎంతంటే..?

Akkineni Nagarjuna: సౌత్ లోనే రిచ్చెస్ట్ హీరో నాగార్జున.. ఆయన నికర ఆస్తుల విలువ ఎంతంటే..?

Akkineni Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా అక్కినేని నాగార్జున టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. నాగేశ్వరరావు ఉన్నప్పుడే.. తండ్రికి మించిన కొడుకు అని అనిపించుకున్నాడు. నాగేశ్వరరావు బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యనికి  నాగ్ కింగ్ గా మారాడు.  నాగ్ .. కేవలం హీరోగానే కాదు.. పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్ గా కూడా సక్సెస్ అందుకున్నాడు.  వరుస సినిమాలు, ప్రకటనలు, బిజినెస్ లు.. ఇలా అన్నింటిలోనూ కాలుపెట్టి..  ఎక్కడా తగ్గకుండా  అక్కినేని బ్రాండ్ ను దేశమంతటా వినిపించేలా చేస్తున్నాడు.


ఇక నేడు.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ ను సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేసిన విషయం తెల్సిందే. దీంతో నాగార్జునకు కోట్లలో నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. హైదరాబాద్లో బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్స్ లో నాగార్జునది ఒకటి. టాలీవుడ్ లో ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా.. వేరే వేడుకలు అయిన మొదట N కన్వెన్షన్ లోనే జరుగుతాయి.   ఇక ఈ ఘటన జరిగాక  నెటిజన్స్ అసలు నాగ్ ఏ బిజినెస్ లు చేస్తున్నాడు.. ఏ బిజినెస్ ల మీద ఎంత వస్తున్నాయి.. ? సినిమాల మీద వచ్చే ఆదాయం ఎంత.. ?  నాగార్జున నికర ఆస్తుల విలువ ఎంత.. ? అనేదాని మీద ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

నాగార్జునది మొదటి నుంచి బిజినెస్ మైండ్. కేవలం   సినిమాలు చేసిన డబ్బు మీదనే  డిపెండ్ అవ్వకుండా.. బయట బిజినెస్ లు నడపడం మొదలుపెట్టాడు.  నాగ్ కు సినిమాల మీద వచ్చే ఆదాయం కంటే.. వ్యాపారాల మీద వచ్చే ఆదాయమే ఎక్కువ. అన్ని రంగాల్లో నాగ డబ్బును ఇన్వెస్ట్ చేశాడు. సినిమా రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్,  N  కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇక  చిరంజీవి, నాగార్జున కలిసి మా ఛానెల్ ను మొదలుపెట్టారు. కొన్నేళ్ళకు చిరు దాని నుంచి తప్పుకోగా..  నాగ్ సైతం ఆ ఛానెల్ ను స్టార్ మాకు అమ్మేశాడు.


Also Read: ‘N కన్వెన్షన్’లో ఫంక్షన్ చెయ్యాలంటే అంత చెల్లించాల్సిందే – వామ్మో ఏడాదికి నాగ్ అంత సంపాదిస్తున్నాడా ?

అయితే అందుతున్న సమాచారం ప్రకారం .. ఇంకా కొన్ని షేర్స్ నాగ్ .. మా లో ఉంచాడని టాక్.   ఇక ఇవి కాకుండా  ఒక మీడియా స్కూల్ ను నడుపుతున్నాడు. ఇక్కడితో నాగ్ ఆగలేదు. రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ లాంటి వాటిలో కూడా నాగ్ పెట్టుబడులు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే నాగార్జున నికర ఆస్తుల విలువ అక్షరాలా  రూ.3010 కోట్లు ఉంటుందని ఓ రిపోర్టులో తేలింది. ఏంటి షాక్ అవుతున్నారా.. ?  ఈ రిపోర్ట్ గతేడాదిది. ఈ ఏడాదికి ఇంకా పెరిగి ఉంటుంది అని చెప్పొచ్చు.

సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, బిగ్ బాస్ ఇలా  నాగ్ ఆస్తుల విలువ పెరుగుతూనే వస్తుంది. ఇన్ని ఆస్తుల మధ్య ఈ N  కన్వెన్షన్ కూల్చివేత నాగ్ కు లెక్కలోకి కూడా రాదంటున్నారు కొందరు. కానీ, ఆయన మాత్రం ఒక్క రూపాయిని కూడా వదిలే టైప్ కాదని ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకే ఈ N  కన్వెన్షన్ మళ్లీ తన చేతికి వచ్చేవరకు నాగ్ పోరాటం ఆగదనే చెప్పాలి.

ఇక ఇన్ని ఆస్తులు ఉన్నా.. నాగ్ కు తీరని లోటు  ఏదైనా ఉంది అంటే అది తన వారసుల సక్సెస్ ను చూడలేకపోవడమే. అక్కినేని వారసులు నాగ చైతన్య,  అఖిల్.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా స్టార్ హీరోలుగా నిలువలేకపోయారు. నాగ్ తరువాత అక్కినేని లెగసీని నిలబెట్టగలిగేది వారు మాత్రమే. మరి ముందు ముందు ఈ వారసులు అక్కినేని లెగసీని కాపాడతారేమో చూడాలి.

Related News

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Big Stories

×