EPAPER

Tollywood Senior Directors Fail : సీనియర్ డైరెక్టర్ల వద్ద ఇక మ్యాటర్ లేదా?.. అంతా రొటీన్ సినిమాలే తీస్తారా..

Tollywood Senior Directors Fail : సీనియర్ డైరెక్టర్ల వద్ద ఇక మ్యాటర్ లేదా?.. అంతా రొటీన్ సినిమాలే తీస్తారా..

Tollywood Senior Directors Fail| టాలీవుడ్ లో ఈ సంవత్సరం విజయం సాధించిన సినిమాలు తక్కువే అయినా.. వాటిలో ఎక్కవగా యువ డైరెక్టర్ల సినిమాలే ఉన్నాయి. పేరు మోసిన సీనియర్ డైరెక్టర్ల సినిమాలు అంచనాలు అందుకోవడంలో ఫెయిలవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి అని పెద్ద సినిమాలు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ల బతుకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి.


త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్.. వీరంతా టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్లు. వీళ్లు సినిమా మొదలెట్టారనగానే అప్పుడే సినిమా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ కంపెనీలు వీరి ఆఫీసుల వద్ద క్యూకడతాయి. ఎందుకంటే ఈ బడా దర్శకులు పెద్ద హీరోలతోనే సినిమాలు తీస్తారు. సినిమా కూడా మంచి బడ్జెట్ పెట్టి తీస్తారు. వీళ్ల గత సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కానీ ఇటీవల విడుదలైన వీరి సినిమాలు చూస్తుంటే.. వీళ్ల దగ్గర మ్యాటర్ అయిపోయిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పైకి సినిమా సక్సెస్ మీట్లు పెట్టడం, సినిమా ప్రొమోషన్లలో గొప్పలు చెప్పుకోవడమే తప్ప సినిమాలో ఆసక్తి కర కథ, కథనాలు కరువయ్యాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే.. మహేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. మాటల మాంత్రికుడిగా మంచి పేరున్న గురుజీ.. ఈ సినిమాలో ఎందుకో తన మ్యాజిక్ చూపించలేకపోయాడు.


సినిమాలో ఒక్క శ్రీలీల పాట ‘కుర్చి మడత పెట్టి’ పాట మినహాయిస్తే.. సినిమా అంతా బోర్. త్రివిక్రమ్ మార్కు మైమరిపించే డైలాగులు అసలు లేవు. మంచి కుటుంబ కథా సినిమా తీస్తాడనే పేరున్న గురూజీ పట్టు కోల్పోయారనిపిస్తోంది. త్రివిక్రమ్ కొత్త పాయింట్లతో సినిమా తీస్తే.. ఇప్పటికీ ఆయన అభిమానులు తప్పక ఆదరిస్తారు.

పెద్ద దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను పేరు కూడా వస్తుంది. బోయపాటి సినిమాలంటే మాస్. మాస్ సినిమాలంటే బోయపాటి కేరాఫ్ అడ్రస్ అంతే. లాజిక్ అడగొద్దు.. అంతా మేజిక్ మాత్రమే. తీసిన సినిమాలలో ఎక్కువగా హీరో రెండు పాత్రలు చేయడం రొటీన్ అయిపోయింది. చీటికి మాటికి హీరో కత్తులు, గొడ్డళ్లు పట్టుకొని అడ్డుగా వచ్చిన వందల మందిని నరకడమే సినిమాలో యాక్షన్. ఏదో బాలకృష్టతో తప్పితే బోయపాటికి ఇతర హీరోలతో కలిసి రావడం లేదు. బెల్లం కొండ శ్రీనివాస్ తో తీసిన జయజానికి నాయక, రామ్ పోతినేని తో తీసిన స్కంద సినిమాలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. ఈయన సినిమాలు ఇలాగే ఉంటాయని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. అయితే బోయపాటి సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడం కూడా సినిమా ఫ్లాప్ అవడానికి కారణం.

ఇక పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్ సినిమాల విషయానికొస్తే.. పూరీ జగన్నాధ్ వరుసగా ఫ్లాపులు ఇస్తూ.. ఏదో ఇంగ్లీషు సినిమా కాపీ కొట్టి.. ఆ కథకు పోకిరి మిక్స్ చేసి ఇస్మార్ట్ శంకర్ అని తీశాడు. అది కాస్తా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత లైగర్ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో పూరీ ఈజీగా ఇంకో హిట్ కొట్టడానికి సీక్వెల్ ఫార్ములాను నమ్ముకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు రెండో భాగంగా డబుల్ ఇస్మార్ట్ అని తలతోక లేని కథతో సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపించాడు.

చివరగా హరీష్ శంకర్ పరిస్థితి కూడా పూరీ లాగానే ఉంది. అయితే హరీష్ శంకర్ రీమేకులను నమ్ముకుని బతికేస్తున్నాడు. అప్పుడెప్పుడో మిరపకాయ తో మంచి హిట్టు కొట్టాడు. ఆ తరువాత హిందీ సినిమా దబంగ్ ని పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి మంచి ఎంటర్ టైన్మెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత అన్నీ రీమేకులే. అంతెందుకు హరీష్ శంకర్ తదుపరి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ సినిమా తేరీకి రీమేక్. తాజాగా రవితీజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాని ప్రేక్షకులు పూర్తిగా రిజెక్ట్ చేశారు. హిందీ సినిమా రైడ్ ని రీమేక్ చేస్తూ.. మిరపకాయ సినిమా సీన్లు సేమ్ టు సేమ్ కాపీ కొట్టి ఇందులో కలిపాడు. సినిమా ఫలితం చూస్తే.. డిజాస్టర్.

వీరంతా సీనియర్ దర్శకులు.. వీరికి సినిమా రూపొందించడంలో మంచి పేరుంది. కానీ వీళ్ల దెగ్గర మ్యాటర్ మాత్రం ఖాళీ. అందుకే కొత్తగా వచ్చే రైటర్ల వద్ద కొత్త ఐడియాలతో సినిమాలు తీస్తే ఇంకా కొంత కాలం వీరికి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇక్కడితో సమాప్తం.

Also Read:  సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా.. మరోసారి చిరుతో పోటీ!

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×