EPAPER

Kethireddy Peddareddy: బుసలు కొడుతోన్న ఫ్యాక్షన్ రాజకీయం.. పరేషాన్ లో పెద్దారెడ్డి

Kethireddy Peddareddy: బుసలు కొడుతోన్న ఫ్యాక్షన్ రాజకీయం.. పరేషాన్ లో పెద్దారెడ్డి

Kethireddy Peddareddy: గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైసీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరించారు. ప్రత్యర్థులపై కేసులు.. వారి వ్యాపారాలపై దాడులు చేయించారు. కట్ చేస్తే.. ప్రభుత్వం మారింది. ప్రస్తుతం ఆ సీనియర్ నేత ఒంటరయ్యారు. అటు అధిష్టానం నుంచి మద్దతు లేక.. సొంత నియోజకవర్గంలో కనీసం అడుగుపెట్టే పరిస్థితి లేక సతమతం అవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత.. ఏమిటా కథ.


తాడిపత్రి… ఈ పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయం. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ బుసలు కొడుతూనే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫ్యాక్షన్ వాసనలు తగ్గినా.. తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి మారలేదు. అప్పుడప్పుడూ ఆ జాడ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ జరుగుతోంది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి హవా నడిచింది. 2019లో వైసీపీ ఘనవిజయంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి టైమ్ వచ్చింది. అప్పటి నుంచి జేసీ వర్సెస్ పెద్దారెడ్డిగా వార్ సాగింది. రోజులెప్పుడూ ఒకలా ఉండవనే సామెత ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావటంతో పెద్దారెడ్డికి ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి.

తాడిపత్రిలో 30 ఏళ్లుగా జేసీ కుటుంబానిదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. ఆ కుటుంబానికి సంబంధం లేకుండా ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు. 2019లో మాత్రం ఫ్యాన్ సునామీకి సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తింది. పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సాయంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అనేకసార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఏ ధర్నా చేసినా.. లేక ఏ ఆందోళన చేసేందుకు సిద్ధమైనా.. జేసీ సోదరులను పెద్దారెడ్డి అడ్డుకున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలోనే కూర్చోవటం సంచలనంగా మారింది. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక నేతలు అప్పట్లో చర్చించుకున్నారు. నాటి నుంచి వీరి మధ్య వార్ మరింత పీక్స్‌కు చేరింది.


Also Read: వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ కంటే కేతిరెడ్డి బెటర్..

పెద్దారెడ్డి తన ఇంట్లోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆ విషయాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. 2019 మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటినా.. తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన మార్కు చూపించారు. ఆ ఎన్నికల్లో తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్‌ స్థానాన్ని ప్రభాకర్‌రెడ్డి దక్కించుకోవటంతో వివాదం కాస్తా ముదిరింది. మున్సిపల్ ఛైర్మన్‌.. ఏ కార్యక్రమం తలపెట్టినా.. దానిని అప్పటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అడ్డుకునేవారట. తనకున్న అధికారంతో పోలీసులను విచ్చలవిడిగా వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీన్ కట్ చేస్తే.. 2024 ఎన్నికలు.. కూటమి గ్రాండ్ విక్టరీతో అధికారంలోకి వచ్చింది. ఊహించినట్లే తాడిపత్రిలో..టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఘనవిజయం సాధించారు. పోలింగ్ రోజూ తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. తర్వాత పెద్దారెడ్డికి వరుస కష్టాలు మొదలయ్యాయని పొలిటికల్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఎన్నికల తర్వాత తాడిపత్రి నియోజకవర్గాన్ని వీడిన పెద్దారెడ్డి.. కనీసం సొంత ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల ఆయన తాడిపత్రి రాగా.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం సాగింది. వైసీపీ నేత మురళి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లగా.. తెలుగుతమ్ముళ్లు అభ్యంతరం తెలిపారు. దీంతో మురళి తుపాకీతో హల్‌చల్ చేయగా.. ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఇంట్లో సామాగ్రితో పాటు కారు అద్దాలు పగులగొట్టారు. అక్కడ నుంచి పెద్దారెడ్డిని స్వగ్రామానికి తరలించిన పోలీసులు.. తర్వాత సురక్షితంగా ఆయన్ను పంపించేశారు. ఇంత జరిగినా వైసీపీ అధిష్టానం నుంచి పెద్దారెడ్డికి ఎలాంటి మద్దతు దక్కలేదు.పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకుండా చేసినా.. అధినేత జగన్‌ కానీ.. వైసీపీ నేతలు కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. దీంతో ఒంటిరిగానే పెద్దారెడ్డి తనకు వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొన్నారట.

Also Read: పాపం దువ్వాడ.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఫ్యూచర్ ఏంటి ?

2024 ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసినా.. వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన నేతలు ఎవరూ సంఘీభావం కూడా తెలపని పరిస్థితి. చివరికి తన అన్న కొడుకైన.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదని టాక్ వినిపిస్తోంది. అన్ని విషయాల్లోనూ రెస్పాండ్ అయ్యే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. సొంత బాబాయ్ విషయంలో మాత్రం ఎక్కడా నోరు మెదపలేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లడంతో అక్కడ భారీ ఎత్తున గొడవ జరిగింది. ఇది అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి.. తాను తాడిపత్రిని వదులుకోబోమని అన్నారు. తాత్కాలికంగా తనను ఆపినా.. భవిష్యత్‌లో మళ్లీ తాడిపత్రి నుంచి పాలిటిక్స్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు.. పెద్దారెడ్డి వైఖరిపైనా స్థానిక నేతలు గుప్పుమంటున్నారు. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాడు జేసీ ఇంట్లోకి వెళ్లి రుబాబు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు పెద్దారెడ్డి చేసింది న్యాయమైతే.. ఇవాళ జేసీ అనుచరులు చేసింది కూడా సబబేనంటున్నారట. తాజాగా జిల్లా ఎస్పీని కలిసేందుకు అనంతపురం జిల్లా నేతలు.. పెద్దారెడ్డితో పాటు వెళ్లారు. ముగ్గురు, నలుగురు నాయకులు మాత్రమే ఆయనకు సంఘీభావం తెలిపారని.. మిగిలిన వారు అటువైపు కన్నెత్తి చూడలేదని సొంతపార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాప్తాడు, గుంతకల్లు , సింగనమల ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులెవరు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట.

ఓ వైపు.. సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేకపోవటం.. మరోవైపు అధిష్టానం నుంచి సహకారం లేకపోవటంతో పెద్దారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారట. ఒకప్పుడు ఏకచత్రాధిపత్యం చేసిన పెద్దారెడ్డికి ఊహించని విధంగా షాకులు తగలటంతో భవిష్యత్‌లో ఏం చేయనున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×