Madonna Sebastian: హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. తక్కువ సినిమాలతో మాలీవుడ్, కోలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది.
కాకపోతే ఆఫర్లను అందిపుచ్చుకోవడంలో డిలే అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రేమమ్ మూవీతో తొలిసారి సౌత్ గ్లామర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
మూడు భాషల్లో ఆ చిత్రం హిట్టయ్యింది. కాకపోతే మాలీవుడ్, కోలీవుడ్‌లో మాత్రం బిజీగా ఉంది. టాలీవుడ్ వైపు అంతగా ఫోకస్ పెట్టినట్టు కనిపించలేదు.
అందుకే అవకాశాలు పెద్దగా రాలేదట ఈ అమ్మడికి. మూడేళ్ల కిందట నాని చిత్రం శ్యామ్ సింగరాయ్‌లో కనిపించింది. కాకపోతే అందులో కేవలం అడ్వకేట్ పాత్రకే పరిమితమైంది.
ఆ తర్వాత తెలుగు వైపు చూడలేదు. కావాల్సినంత అందం ఈమె సొంతం. లక్షల్లో ఈమెకు ఫాలోవర్స్ ఉన్నారను కోండి.
వాటిని మరింత పెంచుకునేందుకు మరింతగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వెరైటీగా ఫోటోషూట్స్ చేస్తోంది. లైట్‌గా స్మైల్ ఇస్తూ యూత్‌ను గిలగింతలు పెడుతోంది.
ప్రస్తుతం మూడుపదుల వయసున్న ఈ సుందరి, తెలుగులో సరైన హిట్ కొట్టాలని ఆలోచన చేస్తోంది. మరి ఆమె డ్రీమ్ త్వరలో నెరవేరాలని భావిద్దాం.