EPAPER

Lemon Water: ఉదయం పూట నిమ్మరసం తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా ?

Lemon Water: ఉదయం పూట నిమ్మరసం తాగితే అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా ?

Lemon Water Health Benefits: నిమ్మతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు  ఉంటాయి. నిమ్మకాయలో సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు , ప్రోటీన్లతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో నిమ్మ ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది.


నిమ్మను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయం పూట నిమ్మరసంలో తేనె కలిపి తాగుతున్నారు. ఇలా ఉదయం పూట నిమ్మరసం తాగడం కూడా మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. దినచర్యలో భాగంగా ఉదయం నిమ్మరసం తాగడం కూడా అలవాటు చేసుకుంటే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయని అంటున్నారు. మరి నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:
నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మ రసాన్ని ఉదయం పూట క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.అంతే కాకుండా అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యంగా ఉండడానికి నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది. ఇది మన శరీర కణాలను సంరక్షిస్తుంది.


జీర్ణక్రియ :
నిమ్మరసం జీర్ణవ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏర్పడే యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఉదయం పూట నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ కూడా సవ్యంగా జరుగుతుంది. ప్రేగుల కదలిక కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఛాతిలో మంట, ఉబ్బరం వంటి అజీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

హైడ్రేట్ :
శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలి అంటే అందుకు విటమిన్ సి ఎంతో అవసరం. నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. నిమ్మరసం తాగడం వల్ల చర్మంపై నిగారింపు వస్తుంది. అంతే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా నిమ్మ రసం ఎంతో ఉపయోగపడుతుంది. తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

చర్మ ఆరోగ్యం :
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు దీని ద్వారా తగ్గుతాయి. నిమ్మరసం తరచుగా తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మెరిసే చర్మానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మరసం తాగితే చర్మం మృదువుగా, తేమగా కూడా తయారవుతుంది.

బరువు తగ్గడానికి :
అధిక సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బరువు తగ్గడానికి నిమ్మరసం తాగాలి. జీవక్రియను ఇది క్రమబద్దీకరిస్తుంది. ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్చుకోవడంతో పాటు నిమ్మరసం తరుచుగా ఉదయం పూట తీసుకోవడం వల్ల మీ బరువులో మార్పు తప్పకుండా వస్తుంది. అంతే కాకుండా రోజుకు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేస్తూ నిమ్మ రసాన్ని ఉదయం పూట తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

శక్తి పెరుగుదల :
నిమ్మ రసం తరచుగా తాగడం వల్ల మానసిక స్థాయితో పాటు శక్తి స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. ఉదయం నిమ్మ రసాన్ని తాగడం వల్ల రోజంతా మీరు జోష్‌తో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

పీహెచ్ స్థాయి :
నిమ్మరసం మన శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పీహెచ్ స్థాయిలు సమతుల్యం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం వల్ల శరీరంపై ఏర్పడే ఆల్కలైజింగ్ ప్రభావంతో ఎక్కడైనా వాపు లాంటివి ఉంటే అవి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

Also Read: ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మీ శరీరంలో మ్యాజిక్ చూస్తారు..

గుండె ఆరోగ్యానికి మేలు :
పొటాషియం, విటమిన్ సి లాంటివి నిమ్మరసంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. క్రమం తప్పకుండా నిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×