EPAPER

40000 drug addicts: షాకింగ్.. తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు.. ఎక్కువగా..

40000 drug addicts: షాకింగ్.. తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు.. ఎక్కువగా..

40000 drug addicts: డ్రగ్స్.. ఈ పేరు ఎత్తితే చాలు.. చాలా మంది ఉలిక్కిపడతారు. వీటికి దూరంగా ఉండాలని పెద్దలు తరచూ చెబుతారు. దీని జోలికి వెళ్లకపోవడమే బెటరని అంటారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన యువత.. సమాజానికి ప్రమాదకరం కూడా. తాజాగా తెలంగాణ 40వేల మంది డ్రగ్స్ బాధితులు ఉన్నట్లు టీ న్యాబ్ వెల్లడించింది.


డ్రగ్స్‌పై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఏ మాత్రం తెలంగాణలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడానికి వీల్లేదని సంబందిత అధికారులకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనివైపు యువత ఆకర్షితులు కాకుండా చూడాలని ఆదేశించారు. తాజాగా తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు తేలింది.

డ్రగ్స్‌కు అడిక్ట్ అయినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. గడిచిన ఏడు నెలల్లో 6000 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. బాధితులే డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నట్టు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది.


ALSO READ: రుణమాఫీ తప్పెవరిది? పదేళ్లు ఏం చేశారు..? ఆ తప్పులు దాచి నేడు ఆరోపణలు

ఇక నార్కోటిక్ బ్యూటీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారని, చివరకు బానిసలవుతున్నారని తేలింది. డ్రగ్స్ బాధితులను గుర్తించిన అధికారులు, వారిని డీ ఎడిక్షన్ కేంద్రాలకు తరలిస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతీ 10మందిలో 9 మంది ఫ్రెండ్స్ ద్వారానే వీటిని తీసుకున్నామని, చివరకు అది వ్యసనంగా మారిందన్నది బాధితుల మాట. ఆ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. టీ న్యాబ్ అందు బాటులోకి తీసుకొచ్చిన అధునిక డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్‌ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా డ్రగ్స్ బాధితులను వెంటనే గుర్తిస్తున్నారు.

డ్రగ్స్ బాధితులను గుర్తించి డీ ఎడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. మాదక ద్రవ్యాలకు అలవాడు పడినవారు తిరిగి నార్మల్ స్థితికి ప్రభుత్వాలు ఒక్కొక్కరిపై భారీగానే ఖర్చు చేస్తోంది. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచన చేస్తున్నారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×