EPAPER

Kolkata Incident: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ బాడీ వద్ద చిరిగిన డైరీ.. అందులో ఏముందంటే ?

Kolkata Incident: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ బాడీ వద్ద చిరిగిన డైరీ.. అందులో ఏముందంటే ?

Kolkata incident updates today(Telugu breaking news): కోల్‌కతాలో రెండు వారాల కిందట ఆర్‌జి కేర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ట్రైనీ డాక్టర్ మృతిపై రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా డాక్టర్ బాడీ వద్ద ఓ డైరీ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహం వద్ద దొరికిన డైరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే బాడీ దగ్గర దొరికన ఆ డైరీలో తాను జీవితంలో సాధించబోయే కలల గురించి రాసుకున్నట్లు వెల్లడించారు. తన జీవితంలో పెట్టుకున్న లక్ష్యాలను అందులో వివరంగా రాసుకుంది.


ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇందులోని వివరాలను వెల్లడించింది. ఆగస్టు 9న ఈ ఘోరమైన ఘటన జరిగిన సెమినార్ రూమ్‌లో ఆమె మృతదేహానికి సమీపంలో డైరీ దొరికింది. ఆ డైరీలో ఆమె చదువు, జీవితంలో తన లక్ష్యాలు, కుటుంబం పట్ల తనకు ఉన్న ప్రేమ గురించి వివరంగా రాసుకుంది. అంతేకాదు తాను వైద్య రంగంలో ఓ గోల్డ్ మెడల్ సంపాదించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు అందులో తెలిపింది. మరోవైపు వైద్య రంగంలో పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ లా వ్యవహరించాలని కోరుకుంది. తన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని దాని కోసం తాను ఎంత కష్టమైనా పడతానని అందులో రాసుకుంది. ఇక కొన్ని ఆసుపత్రుల పేర్లను కూడా డైరీలో రాసుకుంది. ఆ పెద్ద ఆసుపత్రుల్లో తాను పనిచేయాలని కోరుకుంది.

డైరీలో కొన్ని పేజీలు కూడా చిరిగిపోయి ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. కాగా, ఉద్యోగం, చదువుల విషయంలో మానసికంగా కుంగిపోతున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు వెల్లడించారు. సందీప్ ఘోష్ నేతృత్వంలోని మెడికల్ కాలేజీలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల మధ్య ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. కళాశాలలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే విషయంపై కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ బుధవారం కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని R.G కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేసినట్లు ప్రకటించింది. ఇందులో దాని కొత్త ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉన్నారు. కొత్తగా నియమితులైన ప్రిన్సిపల్ సుహృతా పాల్‌తో పాటు, కొత్తగా నియమితులైన మెడికల్ సూపరింటెండెంట్ & వైస్ ప్రిన్సిపాల్ బుల్బుల్ ముఖోపాధ్యాయ, ఇన్‌స్టిట్యూట్ చెస్ట్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అరుణవ దూత చౌదరి కూడా బదిలీ అయ్యారు.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×