EPAPER

Modi Ukraine Visit: ఉక్రెయిన్ లో మోదీ పర్యటన.. దాని వెనుక పెద్ద కథే ఉందని మీకు తెలుసా ?

Modi Ukraine Visit: ఉక్రెయిన్ లో మోదీ పర్యటన.. దాని వెనుక పెద్ద కథే ఉందని మీకు తెలుసా ?

Modi Ukraine Visit: నరేంద్రమోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. వినడానికి చాలా చిన్న స్టేట్‌మెంటే కానీ.. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. ప్రపంచం మొత్తం ఒక్కసారి మోడీపై మరోసారి ఫోకస్ చేసింది. ఎవరికి అంతుపట్టని మోడీ అని ఆలోచిస్తోంది. ఎందుకంటే మోడీ రష్యాలో పర్యటించి నెల రోజులు కాకముందే.. ఆ దేశ బద్ధ శత్రువైన.. యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో పర్యటించడం మోడీకే చెల్లింది. ఇంతకీ ఈ పర్యటనతో మనకు జరిగే లాభమేంటి? ఉక్రెయిన్‌కు వచ్చే లబ్ధి ఏంటి?


ఆగస్టు 23.. ఉక్రెయిన్‌ నేషనల్ ఫ్లాగ్‌ డే. ఆ దేశానికి చాలా ప్రత్యేకమైన రోజు అది. అలాంటి రోజున మోడీ కీవ్‌లో అడుగుపెట్టబోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైమ్‌ అక్కడ పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి ఆయన ప్రత్యేక రైలులో వెళ్తున్నారు. చాలా ప్రొటెక్టడ్.. సెఫెస్ట్‌ ట్రైన్‌ అది. ఇలా చాలా చాలా వార్తలు మీరు వింటూనే ఉన్నారు. కానీ.. ఇక్కడ అది కాదు అసలు వార్త. మోడీ కీవ్‌కు ఎందుకు వెళ్తున్నారు? ఆయన అక్కడ పర్యటిస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారనేదానిపై ఇప్పుడు మనం ఫోకస్ చేద్దాం.

పోలాండ్‌లో ఉన్న మోడీ ఇప్పటికే ఓ శాంతి సందేశం ఇచ్చారు. యుద్ధంతో సాధించేది ఏమీ లేదని.. ఇప్పటికైనా ఇరు వర్గాలు చర్చలు జరపాలని.. ఇద్దరి ఆమోదంతో ఈ యుద్ధానికి చెక్ పెట్టాలన్నారు. అంతా బాగుంది. నిజం మాట్లాడుకుంటే.. అటు రష్యా అయినా.. ఇటు అమెరికా అయినా.. ఎవరు ఏమి చెప్పినా వినరు. జస్ట్‌ పరిస్థితులు వాళ్లకు అనుకూలంగా మారేవరకో.. లేదా ఇంకా చాలు అని అని అనుకున్నప్పుడో మాత్రమే ఈ యుద్ధం ఆగుతుంది. అప్పటి వరకు మోడీ కాదు కదా.. పైనుంచి దేవుడు దిగివచ్చి చెప్పినా వినరు. ఇది హార్డ్ రియాలిటీ.. కొంచెం కష్టమైనా అంగీకరించాల్సిందే.


Also Read: రాజ్యాంగ ఫలాలు కొందరికేనా?

ఇక మోడీ ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చేదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ జియో పాలిటిక్స్‌తో పాటు.. ఇరు దేశాల డిఫెన్స్‌ సెక్టార్‌కు కాస్త లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్‌ కొన్ని విషయాలకు చాలా ఫేమస్. లైక్‌ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నెవీ అండ్ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు కొన్ని స్పేర్‌ పార్ట్స్‌ కావాలి. అవి తయారయ్యేది ఉక్రెయిన్‌లో మాత్రమే.

ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌లో తయారయ్యే వార్‌ షిప్ టర్బైన్స్‌కు వరల్డ్‌వైడ్ మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి ఇండియన్‌ నేవీ వార్‌ షిప్స్‌ కోసం టర్బైన్స్‌ వచ్చేవి. కానీ 2022లో రష్యా ఇక్కడి ప్లాంట్లపై దాడులు చేసింది. ఇది మన డిఫెన్స్ సెక్టార్‌కు కాస్త ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. అంతేగాకుండా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో AN-32 మిలటరీ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. వీటిని అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ఇక్కడి ప్లాంట్‌లోనే తయారయ్యేవి. ప్రస్తుతం 105 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలి. ఇందులో 40 ఉక్రెయిన్‌లో.. మిగిలిన 65 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను ఇండియాలో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత యుద్ధం కారణంగా స్పేర్‌పార్ట్స్‌ దొరకడం లేదు. దీంతో ఈ పని కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చలు జరిగే అవకాశం ఉంది.

Also Read: జగన్ రాజకీయ భవిష్యత్‌ని ఆమె మార్చేస్తుందా?

ఇక ఉక్రెయిన్‌ వైపు నుంచి చూస్తే.. ప్రస్తుతం ఆ దేశం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. అనేక దేశాలు ఆర్థిక సాయం చేస్తున్నా.. అవన్ని మిలటరీ ప్రొడక్ట్స్‌ కొనడానికి, అప్‌గ్రేడ్‌ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే యుద్ధం చేయడానికి మాత్రమే ఉక్రెయిన్‌కు సపోర్ట్‌ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. కాబట్టి.. ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలు జరిగితే ఆ దేశానికి కాస్త ఆర్థిక సాయం అందించినట్టు అవుతుంది. ఇప్పుడు ఇండియాలాంటి దేశం అవసరం ఉక్రెయిన్‌కు ఎంతైనా ఉంది. అందుకే జెలెన్‌స్కీ ఇండియా న్యూట్రల్‌ విధానంపై కాస్త గుర్రుగా ఉన్నా మోడీకి సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

మొత్తంగా చూస్తే మోడీ పర్యటన ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలకు వేదిక కానుంది. అంతేకాదు ఇప్పటికే జోర్యా డిఫెన్స్ ప్లాంట్‌లో భారత్‌ ఫోర్జ్‌లో ఏకంగా 51 శాతం వాటాలు ఇప్పటికే కొనుగోలు చేసింది. కాబట్టి.. ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడుతుంది. మరి దీనిపై రష్యా ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్‌.. ఏం రియాక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా చాలా క్లారిటీతో ఉంది. తమ వల్ల ఏ దేశానికి నష్టం చేకూరదు అని చాలా క్లారిటీగా చెబుతుంది. తమ స్వప్రయోజనాల కోసమే ఒప్పందాలు తప్ప.. దాని వల్ల ఇతర దేశాలకు నష్టం చేకూర్చే ఉద్దేశం లేదని చెబుతుంది. అందుకే ఈ పర్యటనపై రష్యా ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్‌మెంట్‌ రిలీజ్ చేయలేదు. నిజానికి మోడీ ఉక్రెయిన్‌లో ఉన్నంతసేపు ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడున్నది మోడీ.. అంటే భారత ప్రధాని. కాబట్టి.. ఆయనకు హాని చేసే ఉద్దేశం రష్యాకు ఏమాత్రం లేదు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×