EPAPER

Free Ride Service: అదంతా ఫేక్ న్యూస్.. ఫ్రీ రైడ్ సర్వీస్ పై క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు

Free Ride Service: అదంతా ఫేక్ న్యూస్.. ఫ్రీ రైడ్ సర్వీస్ పై క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad police issue advisory on fake news of ‘free ride service’ for women: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో లేనిది ఉన్నట్లు ..ఉన్నది లేనట్లు ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. కొందరు అదే నిజమని భావించి చివరకు అదే ఫేక్ వార్త అని తెలిసే సరికి తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి ఆడవారికి ‘ఫ్రీ రైడ్ సర్వీస్‘ సదుపాయం గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఈ సర్వీసు హైదరాబాద్ పోలీసులు మహిళలకు ఉచితంగా కల్పిస్తున్నారని..రాత్రి పది గంటలనుంచి ఉదయం 6 గంటల దాకా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు ఫలానా నెంబర్ ను సంప్రదిస్తే పోలీసులు వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారని సోషల్ మీడియాలో వార్తను హల్ చల్ చేశారు కొందరు ఆకతాయిలు.


హెల్ప్ లైన్ నెంబర్లంటూ పనిచేయని నెంబర్లు ఇస్తున్నారు. దీనితో హెల్ప్ లైన్ నెంబర్లకు చాలా మంది మహిళలు ఫోన్లు చేస్తున్నారు. దానితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అటువంటి కార్యక్రమం ఏదీ లేదని.. అలా ఉచితంగా ఫ్రీ రైడ్ సర్వీసు అంటూ హైదరాబాద్ నగరంలోగాని, తెలంగాణ ప్రాంతంలో గానీ ఎక్కడా లేదని క్లారిటీ ఇస్తున్నారు. ఇదంతా ఎవరో ఆకతాయిలు సృష్టించిన ఫేక్ వార్త అని.. సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న ఈ వార్త పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన లో హైదరాబాద్ పోలీసులు తెలియజేశారు.

ఫేక్ వార్తల పట్ల అప్రమత్తం


ఇలాంటి ఫేక్ వార్తలతో పబ్లిక్ ను గందరగోళానికి గురిచేస్తున్నారని.. అటువంటివారిని ఉపేక్షించబోమని అన్నారు. 1091 నెంబర్ కుగానీ, 7837018555 నంబర్లంటూ హెల్ప్ లైన్ నెంబర్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారని..అటువంటి వార్తల పట్ల ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు మహిళలను అప్రమత్తం చేస్తున్నారు.

ఎక్కడో పంజాబ్ లోని లూథియానా ప్రాంతంలో ఇలాంటి హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయని అక్కడి వార్తను తెచ్చి ఇక్కడ అన్వయిస్తున్నారని..అటు వంటి ఫేక్ వార్తలు ఈ మధ్య తరచుగా వస్తున్నాయని.. తమ కార్యాలయానికి చాలా మంది వ్యక్తిగతంగా వచ్చి ఈ నెంబర్లు పనిచేయడం లేదని.. అటువంటి సౌకర్యం ఏదైనా ఉందా అని అడుగుతున్నారని అంటున్నారు. ఇలాంటి సదుపాయం కల్పించే ముందర రాష్ట్ర ప్రభుత్వం పేపర్ ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేస్తుందని.. తమకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని..ఇప్పటికైనా వీటిపై అపోహలు మానుకోవాలని.. పోలీసులు సూచిస్తున్నారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి వార్తలను ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదని వార్నింగులు ఇస్తున్నారు.

 

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×