EPAPER

FasTag Deduct: ఇంట్లో హాయిగా సేదతీరుతున్న సీఈవో.. ఫోన్ లో ఫాస్టాగ్ మెసేజ్ చూసి షాక్!

FasTag Deduct: ఇంట్లో హాయిగా సేదతీరుతున్న సీఈవో.. ఫోన్ లో ఫాస్టాగ్ మెసేజ్ చూసి షాక్!

FasTag Deduct| ఒక కంపెనీ సిఈవో సెలవు రోజు హాయిగా ఇంట్లో ఉన్నప్పుడు అతని మొబైల్ ఫోన్ లో మెసేజ్ వచ్చింది. అతని ఫాస్టాగ్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు అందులో ఉంది. ఆ సీఈవో ఇంట్లో ఉంటే ఆ మెసేజ్ లో మాత్రం అతని కారు 30 కిలీమీటర్ల దూరంలో ఉన్నట్లు.. అక్కడ టోల్ ప్లాజా దాటుతుండగా.. అతని ఫాస్టాగ్ అకౌంట్ నుంచి టోల్ ఫీజ్ కట్ అయినట్లు ఉంది. అది చూసి ఆ సీఈఓ షాక్ అయ్యాడు. తన కారు ఇంట్లో ఉండగా.. డబ్బులు ఎలా కట్ అయ్యాయని అతను కంగారు పడ్డాడు.


ఆ తరువాత అతను ఆ మెసేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన కారుతో ఇంటి వద్ద ఉన్నప్పుడు టోల్ ఫీజ్ కట్ అయిందని చెబుతూ ఫాస్టాగ్ అధికారులకు ఇదెలా జరిగిందని ప్రశ్నించాడు. ఇప్పుడు అతని పోస్ట్ కు 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వివరాల్లోకి వెళితే పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరానికి చెందిన సుందర్ దీప్ సింగ్ అనే వ్యక్తి ప్రిన్స్ పైర్ టెక్నాలజీస్ సిఈవో గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతను ఆదివారం రోజు సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో అతని ఫోన్ కి మెసేజ్ వచ్చింది. అతని కారు ఫాస్టాగ్ అకౌంట్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.220 టోల్ ఫీజు కట్ అయినట్లు అందులో వివరాలున్నాయి. సందర్ దీప్, అతని కారు ఇంట్లోనే ఉండగా.. అతను 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న లదోవాల్ టోల్ బూత్ క్రాస్ చేసినట్లు.. అందుకు టోల్ ఫీజు కట్ అయిందని మెసేజ్ లో ఉంది. ఆ మెసేజ్ చూసి సుందర్ దీప్ సింగ్ షాకయ్యాడు.


అయితే ఈ విషయాన్ని ఫాస్టాగ్ వారికి ఫిర్యాదు చేశాడు. తన ఫోన్ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ”నా అకౌంట్ లో నుంచి ఫాస్టాగ్ డబ్బులు రూ.220 కట్ అయ్యాయి. నేను నా కారుతో పాటు ఇంట్లోనే ఉన్నాను. కానీ నా ఫోన్ కు వచ్చిన మెసేజ్ లో లదోవాల్ టోల్ బూత్ క్రాస్ చేసినట్లు చూపించింది. నేను గత నెల రోజులుగా ఆ మార్గంలో అసలు ప్రయాణించనే లేదు. ఏం జరుగుతోంది? నాకు సమాధానం చెప్పాలి” అని ప్రశ్నిస్తూ.. ఫాస్టాగ్ వారికి ట్యాగ్ చేశాడు.

అయితే ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సుందర్ దీప్ ట్వీట్ పై చాలా మంది స్పందించారు. సిద్ధాత్ గుప్తా అనే వ్యక్తి సుందర్ దీప్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ”నాకు ఇలాగే గత సంవత్సర కాలం నుంచి డబ్బులు కట్ అవుతూనే ఉన్నాయి. ఎవరో నా కారు నెంబర్ ని ఉపయోగిస్తున్నారు. వారి ఫాస్టాగ్ చలాన్లు అన్నీ నా అకౌంట్ లో నుంచి కట్ అవుతున్నాయి. నేను బ్యాంక్ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నో సార్లు తిరిగాను కానీ ఇంతవరకు సమస్య అలాగే ఉంది. ఇంక విసిగి పోయి ఆ ఖర్చులు కూడా ప్రతి నెల భరిస్తున్నాను.” అని రాశాడు.

మరో ప్రకాశ్ అనే గుజరాత్ కు చెందిన వ్యక్తికి కూడా ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయని.. తన కారు ఆంధ్ర ప్రదేశ్ వద్ద ప్రయాణస్తున్నట్లు చూపించి ఫాస్టాగ్ డబ్బులు కట్ అవుతున్నట్లు చూపిస్తోందని ట్వీట్ చేశాడు. చెన్నై కు చెందిన నారాణన్ హరిహరన్ అనే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని తెలిపాడు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

అయితే తాజాగా సుందర్ దీప్ సింగ్ ఫిర్యాదుపై ఫాస్టాగ్ నిర్వహకులు స్పందించారు. అతని బ్యాంక్ లో ఫిర్యాదు చేయమని సూచించారు. బ్యాంక్ వారు ఫిర్యాదు పరిశీలించిన తరువాతే తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

ఫాస్టాగ్ అనే డివైస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ డివైస్ టోల్ బూత్‌ల వద్ద ఉంటుంది. కారు విండ్‌షీల్డ్ (ముందుభాగంలోని అద్దం)పై ఉన్న ఫాస్టాగ్ బార్ కోడ్ ని స్కాన్ చేస్తుంది. ఆ బార్ కోడ్ కారు యజమాని బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉంటుంది. కారు టోల్ బూత్ వద్ద నుంచి క్రాస్ కాగానే టోల్ ఫీజు ఫాస్టాగ్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.

Also Read: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!

Related News

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Big Stories

×