చాలామందిని కాళ్లలో ఆనెలు వేధిస్తూ ఉంటాయి.

అరికాళ్లలో ఆనెలు ఉన్నవారు ఎక్కువసేపు నడవలేరు

ఆనెలను ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు.

ఈ చిట్కాలను పాటించే ముందు అరికాళ్లలో మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసాన్ని ఆనెలపై రాస్తూ ఉంటే కొద్దిరోజులకి రాలిపోతాయి.

జిల్లేడు పాలతో కూడా ఆనెలు తగ్గుతాయి. అందులో కొద్దిగా పసుపు కలిపి రాసి ప్లాస్టర్ వేయాలి. ఇలా చేసినా ఆనెలు తగ్గుతాయి.

అరికాళ్లను శుభ్రం చేసుకుని కలబంద గుజ్జు రాయాలి. ఆరిపోయాక కడగకూడదు. కొద్దిరోజులకు అవి తగ్గుతాయి.

గోరువెచ్చని నీటిలో వంటసోడా కలిపి ఆనెలకు రాసినా.. ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయల్ని గుజ్జులా చేసుకోవాలి. ఆనెలపై అప్లై చేసి.. ఒక క్లాత్ తో కట్టాలి. ఆరిపోయాక కట్టు తీసేసి కడిగేసుకోవచ్చు.

ఈ చిట్కాలను పాటిస్తే.. ఆనెల సమస్య నుంచి ఉపశమనం కలగవచ్చు.