EPAPER

Rahul Dravid: ఏదైనా సాధించాలంటే.. అదృష్టం కూడా కలిసి రావాలి: ద్రవిడ్

Rahul Dravid: ఏదైనా సాధించాలంటే.. అదృష్టం కూడా కలిసి రావాలి: ద్రవిడ్

Rahul dravid latest comments(Live sports news): క్రెకెట్ లో కప్పు గెలవాలన్నా, ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్నా, ఇక జీవితంలో ఏదైనా సాధించాలన్నా.. కష్టంతో పాటు, కాసింత అదృష్టం కూడా కలిసి రావాలని టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, ఇప్పుడు మాజీ కోచ్ కూడా అయిన లెజండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సియెట్ అవార్డుల ప్రదానోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ద్రవిడ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు.


టీ 20 ప్రపంచకప్ సాధించడంపై మాట్లాడుతూ.. నిజానికి గొప్ప గొప్ప ప్రణాళికలు వేసుకుని, బరిలోకి దిగలేదని అన్నాడు. మనం బయట నుంచి ఎన్ని ప్రణాళికలు వేసినా, వ్యూహాలు రచించినా  గేమ్ లోకి వెళ్లిన తర్వాత ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదని అన్నాడు.

అప్పుడు కెప్టెన్ ఆ క్షణంలో రచించే వ్యూహాలు ఫలిస్తే, విజయాలు దక్కుతాయని అన్నాడు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో అదృష్టం కూడా కలిసొచ్చిందని నవ్వుతూ అన్నాడు.  సూర్యకుమార్ కి డేవిడ్ మిల్లర్ క్యాచ్ దొరకడం అదృష్టం అనే చెప్పాలి. అలాగే గ్రూప్ లో పాకిస్తాన్ తో  జరిగిన‘లో స్కోరు’ మ్యాచ్ గెలిచాం.. అదీ ఒక అదృష్టమేనని అన్నాడు. అది ఓడితే, సూపర్ 8లో ఈక్వేషన్స్ మారిపోయేవని అన్నాడు.


అయితే మనవాళ్లు బాగా కష్టపడ్డారు. దానికి అదృష్టం అనేది తోడైందని వివరించాడు. అన్ని మ్యాచ్ లు విఫలమై, కొహ్లీ కరెక్టుగా ఆడాల్సిన మ్యాచ్ లో ఆడాడు. అదీ  అదృష్టమేనని అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే టీ 20 ప్రపంచకప్ కోసం.. భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదని, అలా జరిగిపోయిందని, సింపుల్‌ ప్లాన్‌తోనే బరిలోకి దిగామని వివరించాడు.

Also Read: నా హీరో, నా డార్లింగ్ అతనే: మను బాకర్

అయితే మరిచిపోలేని బాధ ఒకటుంది. ఇది జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుందని అన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో మేం అద్భుతంగా ఆడాం. రోహిత్ తో కలిసి జట్టు సభ్యులంతా గొప్పగా ఆడారు. ఆ మెగాటోర్నీలో మా ప్రయాణం గొప్పగానే సాగింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాం. అక్కడివరకు అంతా కరెక్టుగా జరిగింది. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అదృష్టం ఏదైతే ఉందో అది ఆ ఒక్క మ్యాచ్ లో కలిసిరాలేదని అన్నాడు.

అప్పుడా అదృష్టం ఆస్ట్రేలియావైపు ఉంది. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలవడం, సెమీఫైనల్ గెలవడం అంతా అదృష్టం వారివైపే నడిచిందని అన్నాడు. ఇదే జీవిత సత్యం అని నవ్వుతూ తెలిపాడు.

భారత్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆటగాడిగా భాగస్వామ్యం కాలేకపోయానని, కానీ కోచ్‌గా వన్డే, టీ 20 రెండు ప్రపంచకప్ ల్లో పనిచేశానని, ప్రజల నుంచి గొప్ప ప్రేమ, ఆదరణ పొందానని, అవి జీవితాంతం మరిచిపోలేనని ఈ సందర్భంగా ద్రవిడ్ అన్నాడు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×