EPAPER

U17 World Wrestling Championship: భారత్ జాక్‌పాట్.. అండర్ 17 ఫైనల్స్‌లో నలుగురు ఇండియన్ మహిళా రెజర్లు

U17 World Wrestling Championship: భారత్ జాక్‌పాట్.. అండర్ 17 ఫైనల్స్‌లో నలుగురు ఇండియన్ మహిళా రెజర్లు

U17 World Wrestling Championship| అండర్ 17 ప్రపంచ కుస్తీ పోటీల్లో ఎవరూ ఉహించనది అద్భుతం జరిగింది. భారత దేశం నుంచి ఏకంగా నలుగురు మహిళా రెజర్లు ఫైనల్స్ కు చేరుకొని చరిత్ర సృష్టించారు. అదితి కుమారి, నేహ, పుల్కిత్, మాన్సీ లథేర్.. ఈ నలుగురు ఇండియన్ మహిళా రెజర్లు సెమీ ఫైనల్స్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ పై గురి పెట్టారు.


అదితి కుమారి – 43 కేజీ కేటగరి
అండిర్ 17 43 కేజీ కేటగిరి ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీల్లో భారత్ కు చెందిన అదితి కుమారి.. అర్మేనియాకు చెందిన అలెక్జాండ్రా బెరెజోవ్‌సాయియా తో తలపడింది. అయితే మ్యాచ్ లో అదితి కుమారి ఫుల్ డామినేషన్ తో ఆడింది. 8-2 స్కోర్ తో విజయం సాధించి ప్రపంచ వేదిక పై భారత్ సత్తాచాటింది. అయితే గురువారం జరుగబోయే ఫైనల్ మ్యాచ్ లో గ్రీస్ కు చెందిన మరియా కీకాను ఓ పట్టు పట్టనుంది. మరియా కీకాతో పోటీ పడి గెవలడం అంత ఈజీ కాదు. అయినా అదితి సెమీఫైనల్ లో ఫుల్ జోష్ ప్రదర్శన చూశాక.. తాను బంగారు పతకం సాధించేందుకు కసిగా ఉన్నట్లు కనిపించింది.

నేహ – 57 కేజీ కేటగిరి
అండర్ 17.. 57 కేజీల కేటగిరిలో భారత రెజ్లర్ నేహా సెమీఫైనల్ లో విజయం సాధించడానికి చాలా కష్టపడింది. అయితే తన టెక్నిక్ తో ఆమె కజకస్తాన్ కు చెందిన అన్నా స్త్రాతాన్ ను 8-4తో ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లో నేహ.. జపాన్ కు చెందిన సుసుయి తో బంగారు పతకం కోసం తలపడనుంది.


పుల్కిత్ – 65 కేజీ కేటగిరి
అండర్ 17- 65 కేజీల కేటగిరిలో భారత రెజ్లర్ పుల్కిత్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన బలమంతా ఉపయోగించి.. ఏకాగ్రతతో ఆడింది. ఈజిప్ట్ కు చెందిన మారమ్ మొహమ్మద్ ఇబ్రహీమ్ ని 3-0 తో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ అద్యంతం పుల్కిత్ చాలా అగ్రెసివ్ గా ఆడింది. ఈ టోర్నమెంట్ మొదటినుంచి పుల్కిత్ అగ్రసివ్ ప్రదర్శన కనబరుస్తోంది. ఆమె ఆటతీరు.. భారత్ రెజ్లింగ్ అభిమానులలో ఫుల్ నింపుతోంది. ఫైనల్ మ్యాచ్ లో పుల్కిత్.. రష్యాకు చెందిన డేరియా ఫ్రోలోవాతో తలపడనుంది.

మాన్సీ లథేర్ – 73 కేజీ
అండర్ 17.. 73 కేజీల కేటగిరీలో భారత మహిళా రెజ్లర్ మాన్సీ లథేర్ సెమీ ఫైనల్స్ లో అద్భుతంగా ఆడింది. యుక్రెయిన్ కు చెందిన ఖ్రీస్తీనా దెమ్‌చుక్ ని 12-2 టెక్నికల్ ఆధిపత్యంతో ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లో మాన్సీ.. రష్యాకు చెందిన హన్నా పిర్స్ కాయాతో తలపడనుంచి.

నలుగురు మహిళా రెజ్లర్లు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు చేరుకోవడం ఇదే తొలిసారి. అయితే ఈ సారి ఇండియాకు బంగారం, రజత పతకాలు తప్పకుండా లభిస్తాయనే ఆశలునెలకొన్నాయి.

Also Read: రోహిత్ శర్మకు ‘ఇంటర్నేష్నల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. మరి విరాట్ కోహ్లీకి?..

మరోవైపు పురుషుల కుస్తీ పోటీల్లో రోనక్ దహియా 110 కేజీ కేటగిరిలో భారత్ కు ఈ సంవత్సరం తొలి పతకం సాదించాడు. టర్కీకి చెందిన ఎమురుల్లా కాప్ కాన్ ని ఓడించి కాంస్య పతకం సాధించాడు. అలాగే 57 కేజీల పురుషుల కేటగిరిలో సాయినాథ్ పార్ధీ.. కజకస్తాన్‌కు చెందిన ముస్సాన్ యెరాస్సీల్ పై విజయం సాధించి.. కాంస్య పతకం సాధించాడు.

Also Read: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?

Related News

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

Big Stories

×