EPAPER

Indoor Plants: ఇంటికి అందాన్ని.. మనకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే !

Indoor Plants: ఇంటికి అందాన్ని.. మనకు ఆరోగ్యాన్నిచ్చే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఇవే !

Indoor Plants: చాలా మందికి మొక్కలు పెంచడం ఇష్టం ఉంటుంది. స్థలం లేదని కొందరు, తీరిక సమయం లేదని మరికొందరు మొక్కలను పెంచడం ఇష్టం ఉన్నా పెంచలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు పట్ణణాల్లో ఉండే చాలా మంది గృహిణులు మొక్కలు పెంచుతున్నారు. ఇంటి డాబాలపై రక రకాల మొక్కలు పెంచుకుంటున్నారు. ఇండోర్ ప్లాంట్స్ పెంచడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇవి ఇంట్లో ఉంటే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా చుట్టూ పచ్చదనం ఉంటే మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా సమయం కేటాయించడం వల్ల ఉల్లాసంగా కూడా ఉంటాము. ప్రస్తుతం అపార్ట్ మెంట్ కల్చర్ పెరగడంతో ఇంటి మందు మొక్కలు పెంచడానికి ప్లేస్ లేని వారు హాల్ , బాల్కనీల్లో మొక్కలు పెంచుకోవచ్చు. వీటి వల్ల మాససిక ప్రశాంతతో పాటు వాస్తు కూడా కలసి వస్తుంది.


మనీ ప్లాంట్ :
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఈ మొక్కను పెంచుకుంటే పేరుకు తగ్గట్లే ఇంట్లోకి సిరి సంపదలు అందిస్తుందట. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పూల కుండీలను కొనుగోలు చేసి వాటిలో పూల మొక్కలు నాటడం మంచిది. వీటి వల్ల అందంతో పాటు వాస్తు కూడా కలిసి వస్తుంది.

డ్రాకేనా:
కుండీల్లో ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటే మొక్కల్లో డ్రాకేనా కూడా ఒకటి. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఆకుపచ్చ. తెలుపు, పసుపు గులాబీ రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అంతే కాకుండా కొన్ని రకాల డ్రాకేనా మొక్కలు మచ్చలు లేదా చారలను కలిగి ఉంటాయి. ివి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. వీటిని చూస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది.


కలబంద:
కలబంద మొక్క చాలా మంది ఇళ్లలో కనువిందు చేస్తుంది. దీనిని ఇంట్లో పెంచుకొవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనికి ఎక్కువగా నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మొక్కల్లో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

ఫెర్న్ జాతి మొక్కలు:
కుండీల్లో పెంచుకునే అత్యంత అనువుగా ఉండే మొక్కల్లో ఫెర్న్ జాతి మొక్కలు కూడా ఒకటి . ఇవి చూడటానికి అందంగా ఉంటాయి. ఈ మొక్కలను కుండీల్లో పెట్టుకుని ఇంట్లో బాల్కనీలు , మెయిన్ డోర్ పక్కన, టెర్రస్ లపై ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫెర్న్ జాతి మొక్కలు గాలిలోని హానికరమైన కెమికల్స్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి.అంతే కాకుండా వీటికి ఎక్కువగా నీరు కూడా పోయాల్సిన అవసరం కూడా లేదు. వీటికి రెండు, మూడు రోజులకు ఒకసారి నీటిని అందించినా సరిపోతుంది.

స్నేక్ ప్లాంట్ :
ఈ మొక్కలు చూడటానికి అందంగా కనిపిస్తాయి. స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఆక్సిజన్ శుద్ది అవుతుంది. వీటిని టేబుళ్లపై, గదుల్లో టీపాయిలపై పెట్టకోవచ్చు.

జాడే ప్లాంట్ :
ఈ ఇండోర్ ప్లాంట్ చిన్న చిన్న ఆకులతో చేడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీటికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు.

Also Read: అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్ ఇదే.. ఓ సారి ట్రై చేసి చూడండి మరి

ఫైకస్ ప్లాంట్ :
కొన్ని మొక్కలు ఎక్కువ ఎండకు తట్టుకోలేవు. కానీ ఫైకస్ మొక్కలు ఎండలో లేదా నీడలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని సంరక్షణ కొసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు.
బాంబూ ప్లాంట్:
ఈ ప్లాంట్ అందమే వేరు. ఇంట్లో ఓ మూలన ఈ ప్లాంట్ పెడితే ఆ ప్రదేశానికి ఆ మొక్క మరింత లుక్ పెంచుతుంది. ఈ మొక్క విష వాయువులను లాగేస్తుంది. వీటిని పెంచడానికి కూడా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×