EPAPER

Farm House: కేటీఆర్‌పై పరువునష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్

Farm House: కేటీఆర్‌పై పరువునష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్

MLA Vivek: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జన్వాడ ఫామ్ హౌజ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. నిబంధనలు ఉల్లంఘించి ఆ ఫామ్ హౌజ్ నిర్మించారని, అది కేటీఆర్‌దేనని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అది తనది కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలవే చాలా ఫామ్ హౌజ్‌లు నిబంధనలు ఉల్లంఘించి నిర్మించబడ్డాయని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు నాయకులు ఖండించారు. ఇదే క్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.


జీవో నెంబర్ 111ను తాను ఉల్లంఘించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. తన తాను ఎల్లప్పుడూ నిబంధనలకు లోబడే నడుచుకున్నానని, తన ఫామ్ హౌజ్‌ను రూల్స్ ప్రకారమే నిర్మించామని స్పష్టం చేశారు. తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.

హైడ్రా చట్టం ప్రకారం ఫామ్ హౌజ్ లేదని, చర్యలు తీసుకోవాలని తనపై దుష్ప్రచారం జరుగుతున్నదని ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్‌కు సవాల్ చేశారు. దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని, తన ఫామ్ హౌజ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు నిరూపించాలన్నారు. లేదంటే.. కేటీఆర్ పై డిఫమేషన్ వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.


Also Read: Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేతపై హైకోర్టు తీర్పు ఇదే

ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. ఒక వేళ తాను తప్పు చేసి ఉంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారం పోవడంతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌లోకి పోతున్నాడని, అందుకే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో జంతవుల కొవ్వు వాడకంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×