సబ్జా గింజలతో ఔషధగుణాలు బోలెడు

సబ్జా గింజలను నీటిలో నానబెట్టి రోజూ తీసుకోవడంతో ఆరోగ్యానికి మేలు.

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.

సబ్జా గింజలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడంలో సాయపడతాయి.

మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింప చేసే విటమిన్ 'ఇ'  ఇందులో ఉంటుంది.

తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు తగ్గడంతో పాటు మానసికంగా ప్రశాంతత ల‌భిస్తుంది.

సబ్జా గింజలను తరచూ తీసుకోవడంతో కావాల్సినంత ఐరన్, పోషకాలు శరీరానికి అందుతాయి.

 గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తాయి.

సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడంతో బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి.

 గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.