Ritika Nayak Latest Photos: ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది.. ఆమె ఎవరో కాదు రితికా నాయక్. వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది ఈ భామ.
విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా వచ్చిన ఫామిలీ ఎంటర్ టైనర్ అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఈ సినిమాలో,సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్.
మొదటి సినిమాతోనే నాచురల్ ఫర్ఫామెన్స్ ఇచ్చి ఆడియన్స్ మనసే కాదు అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్సూసర్స్ మనసే దోచేసింది ఆ ఢిల్లీ ముద్దుగుమ్మ.
ఈ మధ్య కాలంలో అశోకవనంలో అర్జున కళ్యాణం.. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.
ఫస్ట్ మూవీతో పాపులర్ అయిన రితికా నాయక్.. ఏకంగా గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లోనే హీరోయిన్ గా మూడు సినిమాల్లో నటిస్తోంది.
ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా లంగా ఓణీలో ఓ టెంపుల్ దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.