EPAPER

Steve Smith: అప్పుడే రిటైర్మెంటా? సమస్యే లేదు: స్టీవ్ స్మిత్

Steve Smith: అప్పుడే రిటైర్మెంటా? సమస్యే లేదు: స్టీవ్ స్మిత్

Australia batsman Steve Smith says he has no Plans to Retire: నాకన్నా సీనియర్లు చాలామంది క్రికెట్ ఆడుతుంటే, నేనప్పుడే రిటైర్మెంట్ ఎందుకిస్తానని ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ అన్నాడు. అప్పుడే రిటైర్మెంటా? సమస్యే లేదన్నాడు. ఇంకా నాలో ఆడే సత్తా ఉందని తెలిపాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించాడు.


ఇప్పట్లో తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. నాకింకా క్రికెట్ పై ఆసక్తి ఉంది, ఆడాలనే తపన ఉంది, అలాంటప్పుడు కెరీర్ ముగించాలని ఎందుకు భావిస్తానని అన్నాడు. మరి కొన్నేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు. తాను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు.

టీమ్ ఇండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా లాంటివారు, నా వయసు వారే ఉన్నారు, క్రికెట్ ఆడే దేశాల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాత కూడా ఆడుతున్నారని తెలిపాడు. టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్‌లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు.


Also Read: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?

బిగ్ బాష్‌ లీగ్ లో ఆడి, మళ్లీ టీ 20 టీమ్‌లో చోటు సంపాదించడమే లక్షంగా పెట్టుకున్నట్టు  తెలిపాడు. ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళతామో చూడాలని అన్నాడు. అయితే నాకు లభించిన ఏ అవకాశాన్ని వదులుకోనని తెలిపాడు. అందుకే సిడ్నీ థండర్ తో రెండేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. తొలిసారి లీగ్ సీజన్ మొత్తం ఆడేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబర్ 15 నుంచి బిగ్ బాష్ లీగ్ సీజన్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో ఉన్నానని, అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా, ఇంకా తనకు ఉందని స్మిత్ పేర్కొన్నాడు. ఇటీవల తాజాగా జరిగిన టీ 20 ప్రపంచకప్ లో స్మిత్ కు చోటు దక్కలేదు. దాంతో ప్రాక్టీసును పెంచి, బీబీఎల్ లో ఆడి సెలక్టర్ల దృష్టిలో పడాలని విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి తన కోరిక నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×