EPAPER

Prime Minister Narendra Modi: పోలాండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..45 ఏళ్ల తర్వాత తొలిసారి!

Prime Minister Narendra Modi: పోలాండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ..45 ఏళ్ల తర్వాత తొలిసారి!

PM Modi departs for Poland and Ukraine(Political news telugu): ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పోలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ప్రధాని రెండు రోజులపాటు పర్యటించనున్నారు. పోలాండ్ దేశంతో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పయనమయ్యారు. అక్కడ ధ్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో చర్చలు జరపనున్నారు.


పోలాండ్ దేశంలో భారత ప్రధాని 45 ఏళ్ల తర్వాత పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1979లో ఆనాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ ను సందర్శించారు. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని, ఇది రెండు దేశాల బంధాన్ని బలోపంతం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉక్రెయిన్ దేశానికి పయనం కానున్నారు. ఈ దేశంలో ఒక్కరోజు పర్యటించనున్నారు.

మధ్య ఐరోపాలో భారత్‌కు పోలాండ్ కీలక ఆర్థకి భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడితో పాటు ప్రధాని డొనాల్డ్ టస్క్ తో భేటీ కానున్నట్లు చెప్పారు. అనంతరం ఆ దేశంలో ఉన్న భారతీయులతో ముచ్చటించనున్నట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రెండు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్ దేశంలో భారత ప్రధాని చేపట్టనున్న తొలి పర్యటన కావడం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధాన అంశంగా చర్చించనున్నామన్నారు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి తెర పడేలా జెలెన్ స్కీ తో భేటీ కానున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

Also Read: జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో పర్యటించనున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ..

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ పర్యటలో భాగంగా బుధ, గురువారాల్లో పోలాండ్ దేశంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి శుక్రవారం ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించి కీవ్ చేరుకుంటారు. అక్కడ జెలెన్ స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ అదే రైలు మార్గంలో పోలాండ్ చేరుకోనున్నారు. ఈ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి రానున్నారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×