EPAPER

complaint against Reventh reddy: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..ఎవరు పెట్టారో తెలుసా?

complaint against Reventh reddy: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..ఎవరు పెట్టారో తెలుసా?

BRS Leaders complaint against Reventh reddy(Telangana politics): తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం రాజుకుంటూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పట్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం ఎదుట సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు సీఎంని కవ్విపు ధోరణితోనే రెచ్చగొడుతూ వస్తున్నారు. కాగా మంగళవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టారు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని..ఒక రాష్ట్ర సీఎం హోదాలో ఉండి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్:గా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ లో ఏ మాత్రం అహంకారం తగ్గలేదని..అధికారం లేకపోయినా ఒంట్లో బలుపు మాత్రం అలాగే ఉందని వ్యాఖ్యానించారు.


బలుపు వ్యాఖ్యలపై సీరియస్

తెలంగాణ సచివాలయం ముందర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు ను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ చనిపోయాక ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కోట్ల స్కాములు చేసిన కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎంపై కేసుపెట్టినవారిలో ముఠా గోపాల్, బాల్కసుమన్, దాసోజు శ్రవణ్ ఉన్నారు.
కాగా తెలంగాణలో గత కొద్దిరోజులుగా విగ్రహాల రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద తొలగించి సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


 

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×