EPAPER

actress Hema viral vedio: నన్ను సీఎం రేవంత్ దగ్గరకు తీసికెళ్లండ్రా బాబూ..నటి హేమ రిక్వెస్ట్

actress Hema viral vedio: నన్ను సీఎం రేవంత్ దగ్గరకు తీసికెళ్లండ్రా బాబూ..నటి హేమ రిక్వెస్ట్

Tollywood actress Hema wants to meet Reventh.. pawan kalyan: తెలుగు, తమిళ, హిందీ భాషలలో అన్నీ కలిపి 250 చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హేమ. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో కనిపించే హేమ క్రమంగా క్యారెక్టర్ యాక్టర్ గా చేయడం మొదలుపెట్టింది. మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటికి పేరు తెచ్చుకుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో చురుకుగా వ్యవహరిస్తూ తోటి నటీనటులకు అండదండలందిస్తూ వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, ధర్మవరపు సుభ్రహ్మణ్యం లాంటి సీనియర్ కమెడియన్స్ పక్కన కో స్టార్ గా నటించింది హేమ.


తాజాగా విడుదల చేసిన వీడియో

కర్ణాటక శివార్లలో రేవ్ పార్టీ కేసులో హేమడ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ పై విడుదలైన హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదని..తనని అనవసరంగా కేసులోకి లాగారని చెబుతూ వస్తోంది హేమ. తాజాగా మరోసారి బెంగళూరు రేవ్ పార్టీ గురించి ఓ వీడియోను విడుదల చేసింది నటి హేమ. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే నన్ను రేవ్ పార్టీ తర్వాత చాలా హీనంగా చూస్తున్నారని..డ్రగ్స్ తీసుకున్నానో లేదో నిరూపించేందుకు నార్కో ఎనాలిసిస్ కు సంబంధించిన కీలక పరీక్షలు చేయించుకున్నాను. అయితే ఆ పరీక్షలన్నీ నాకు నెగెటివ్ గానే వచ్చాయి. అంటే నేను డ్రగ్స్ తీసుకోనట్లేగా? అదే విషయాన్ని మొదటినుంచి చెబుతూనే ఉన్నాను. మీడియా వాళ్లు కూడా అత్యుత్సాహంతో తనని కొందరు బ్యాడ్ గా జనం దృష్టిలో చులకనగా చూపించారని ..ఇప్పటికే పలు ఛానళ్ల వారికి నేను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టంగా చెప్పడం జరిగిందని అంటోంది హేమ.


ఇదిగో నెగెటివ్ రిపోర్ట్స్
ఈ విషయంలో మీడియా వాళ్లు ఓపెన్ గా డిబేట్ నిర్వహించినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను..ఇదిగో నా నెగెటివ్ రిపోర్టులు..ఇకనైనా నా గురించి నెగెటివ్ గా రాయకండి..మీకు వీలైతే నన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లగలిగితే తీసుకెళ్లండి..అంతేకానీ నన్ను డ్రగ్స్ ఎడిక్టర్ గా చూపించకండి’ అంటూ మీడియా వారికి రిక్వెస్ట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హేమ. కాగా రేవ్ పార్టీకి సంబంధించి అప్పట్లో అరెస్టయిన నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు . కాకపోతే హేమ డ్రగ్స్ తీసుకోలేదని..తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నట్లయితే తిరిగి తనని తీసుకుంటామని మా అధ్యక్షుడు మంచు విష్షు తెలిపారు. అసోసియేషన్ లో క్రియాశీలకంగా వ్యవహరించే హేమ తన తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించడంతో నటి హేమ తాజాగా డ్రగ్స్ నిరూపణ టెస్ట్ చేయించుకోగా అందులో నెగెటివ్ రిపోర్ట్ రావడంతో నటి హేమ ఊపిరిపీల్చకున్నారు. అయితే నటి హేమ విషయంలో కొందరు నెటినెన్స్ ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పవన్  కళ్యాణ్ పొలిటికల్ గా ఉన్నత పదవులలో ఉన్నారు. నిత్యం వాళ్ల బిజీలో వాళ్లు ఉంటారు. ఇలాంటి కేసులను వాళ్లెందుకు పట్టించుకుంటారు. హేమ ఈ విషయంలో కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోందంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్.

 

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×