EPAPER

Zaheer Khan: లక్నో బౌలింగ్ కోచ్‌గా సూపర్ బౌలర్!

Zaheer Khan: లక్నో బౌలింగ్ కోచ్‌గా సూపర్ బౌలర్!

Zaheer Khan to Lucknow Super Giants mentor: ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ప్లేయర్లతోపాటు మెంటర్లుగా అనుభవం ఉన్న దిగ్గజ ఆటగాళ్ల విషయంలో యాజమాన్యాలు వెతుకులాటలు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ వార్త వైరల్ అవుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్యం జహీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు మీడియా కథనాలు సైతం వస్తున్నాయి.


2022, 2023 సీజన్‌లో లక్నో జట్టుకు మెంటర్‌గా ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్..2024 సీజన్‌లో లక్నో విడిచి కోల్‌కతా వెళ్లారు. దీంతో 2024 సీజన్‌లో మెంటర్ లేకుండానే లక్నో జట్టు బరిలోకి దిగింది. తర్వాత బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మార్కెల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. దీంతో లక్నో జట్టుకు మెంటర్ తోపాటు బౌలింగ్ కోచ్ లేకుండా పోయారు. ఈ తరుణంలో లక్నో యాజమాన్యం.. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు సమాచారం.

ఒకవేళ, ఒప్పందం కనుక కుదిరితే జహీర్ ఖాన్ జట్టుకు మెంటర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. లక్నో కోచింగ్ యూనిట్‌లో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, ఆడమ్ వోజెస్, లాన్స్ క్లూసెనర్, జాంటీ రోడ్స్ వంటి వారితో కలిసి జహీర్ ఖాన్ పనిచేయనున్నారు. ఇప్పటికే సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2025 లో లక్నో కోసం మెంటర్‌గా జహీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతోంది.దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


Also Read: సనత్ జయసూర్య హైప్‌ను తగ్గించడంలో మీడియా ప్రభావం

45 ఏళ్ల జహీర్ ఖాన్..భారత్ క్రికెట్ జట్టులో కీ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్‌లో అతడు ఒకడు. భారత్ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 100 ఐపీఎల్ మ్యాచ్‌లే సైతం ఆడాడు. తర్వాత కోచ్‌గా ముంబై ఇండియన్స్ తో కలిసి పనిచేశాడు. తాజాగా, రెండోసారి కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వాస్తవానికి జహీర్ ఖాన్ భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ గా పోటీలో ఉన్నాడు. కానీ గంభీర్..2022,2023 ఐపీఎల్ ఎడిషన్లలో లక్నో తో తనతో కలిసి పనిచేసిన మార్కెల్ ను జాతీయ జట్టు కోచ్ గా ఎంపిక చేసుకున్నాడు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×