Imanvi: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఒక జీవితాన్నే మార్చేస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్స్ మొదటి సినిమా అయితే.. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫేమస్ అయిపోతారు. మొన్నటివరకు భాగ్యశ్రీ బోర్సే మీద పడ్డ నెటిజన్స్ చూపు.. ఇప్పుడు ఇమాన్వి మీద పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన మొదటిసారి నటించే అవకాశాన్ని ఈ చిన్నది చేజిక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
ఇక ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమంలో ఇమాన్వి కనిపించింది. అలా కనిపించిందో లేదో.. ఇలా స్టార్ డమ్ అను అందుకుంది. అసలు ఎవరీమె అని ఫ్యాన్స్ ఆరాలు తీయడం కూడా మొదలుపెట్టారు. కొరియోగ్రాఫర్ అయిన ఇమాన్వి ఓల్డ్ వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెల్సిందే. అయితే చాలామందికి.. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోయిన్లు ఉండగా.. ఇమాన్వినే హను ఎలా సెలెక్ట్ చేశాడు అనే డౌట్ మొదలయ్యింది. దానికి సమాధానంగా హను.. ఇమాన్వి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
” ఇమాన్విని నేను కూడా సోషల్ మీడియాలోనే చూసాను. ఆమె డ్యాన్స్ లకు ఎట్రాక్ట్ అయ్యాను. ఇన్స్టా గ్రామ్ ద్వారానే ఇమాన్విని సంప్రదించాను. ఆడిషన్స్ కు రమ్మని చెప్పాము. 15 రోజులు స్క్రీన్ టెస్ట్ చేసి ప్రభాస్ కు చూపించాను. ప్రభాస్ కు ఇమాన్వి పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కు సరిపోతుందని చెప్పడంతో ఆమెను ఓకే చేసాం ” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కు ఉన్న అనుమానాలు అని తీరిపోయాయి.
ప్రభాస్ సినిమా ఇంకా చేయనే లేదు ఒకే ఒక్కరోజులో ఇమాన్వి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపులో ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తుతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇమాన్వి భవిష్యత్తు లో ఎలాంటి సినిమాలను ఎంచుకుంటుందో చూడాలి.