EPAPER

Venu Swmay: వేణుస్వామి వ్యవహారంపై సీపీ సీరియస్.. ఇక నీకు దబిడి దిబిడే

Venu Swmay: వేణుస్వామి వ్యవహారంపై సీపీ సీరియస్.. ఇక నీకు దబిడి దిబిడే

Hyderabad CP Serious on Venu Swamy(TS news updates): ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నాగచైతన్య – శోభిత ల ఎంగేజ్ మెంట్ తర్వాత మళ్లీ వారిద్దరూ కూడా విడిపోతారంటూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. అయితే అందరి జాతకాలను చెప్పే వేణుస్వామి జాతకం ఇప్పుడు అస్సలు బాలేనట్టుంది. రాజకీయాల్లో ఆయన చెప్పింది నిజం కాకపోవడంతో.. ఇక ఎవరి గురించి చెప్పనన్న వేణుస్వామి.. మళ్లీ చై-శో ల గురించి నోటికొచ్చిందల్లా చెప్పడం.. నెటిజన్లకు కోపం తెప్పించింది. దాంతో తెగ ట్రోల్ చేశారు.


మళ్లీ ఇంకా ఏ సెలబ్రిటీ జాతకం గురించి మాట్లాడనని చెప్పి కాస్త సైలెంట్ అయ్యాడు. కానీ.. నిన్న తన భార్యతో కలిసి తమను జర్నలిస్ట్ మూర్తి తమను డబ్బులివ్వాలని వేధిస్తున్నాడని, అతని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది నెట్టింట్లో, ఇటు న్యూస్ లో పెద్ద సంచలనానికి దారితీసింది. కొన్నేళ్లుగా మూర్తి డబ్బుకోసం తమను వేధిస్తున్నాడని చెప్పిన వీడియో వైరల్ కావడంతో.. దానిపై జర్నలిస్ట్ మూర్తి స్పందించారు.

Also Read: అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఎలా ఉందో చూశారా ? వైవాహిక జీవితంలో ?


వేణుస్వామిని తాను రూ.5 కోట్లు అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు జర్నలిస్ట్ మూర్తి. తన 30 ఏళ్ల జర్నలిజంలో తాను పనిచేసే కంపెనీని జీతం విషయంలో తప్ప ఇంకెవరినీ డబ్బు అడగనన్నారు. కాఫీ, టీ కూడా ఎవరి దగ్గరా తాగలేదన్నారు. తాను చనిపోయాకైనా ఎంక్వైరీలో వేణుస్వామిని డబ్బులు అడిగినట్లు తేలితే.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండే తన డెడ్ బాడీ ఎముకలకు జర్నలిస్ట్ మూర్తి ద్రోహి అని బోర్డు పెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా వేణుస్వామి వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. వేణుస్వామికి సంబంధించిన అన్ని వివరాలు, ఆయనపై ఫైల్ అయిన కేసులన్నింటినీ తెప్పించాలని సైబర్ క్రైమ్ ఐటీ సెల్ అధికారులను ఆదేశించారు. అలాగే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన విడుదల చేసిన వీడియో గురించి కూడా సీపీ ఆరా తీశారు. ఇప్పటివరకూ వేణుస్వామిపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ చేసి.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×