హనుమంతులవారు చిరంజీవుడు. ఆయనకు మరణం లేదని పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడు రాసిన రామాయణాన్ని హనుమద్ రామాయణంగా పిలుస్తారు.

ఆంజనేయుడు శివుని అంశతో జన్మించిన కారణ జన్ముడు.

హనుమంతుడి చిన్ననాటి పేరు మారుతి.

సూర్య నమస్కారాలను సృష్టించింది హనుమంతుడు.

రామలక్మణులను కాపాడేందుకు ఆయన పంచముఖ ఆంజనేయ అవతారమెత్తాడు.

రాములవారు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆయన శరీరమంతా సింధూరాన్ని రాసుకున్నారు. అందుకే నేటికీ ఆయన భక్తులు నుదిటిన సింధూరం ధరిస్తారు.

హనుమంతుని చెమట చుక్క నుంచి పుట్టిన మకరధ్వజుడు ఆయన కుమారుడు.

రాములవారిని తీసుకెళ్లేందుకు యముడు రాగా.. ఆయన్ను అయోధ్యలో కాలుకూడా పెట్టనివ్వలేదు. తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని రాముడు నచ్చచెప్పడంతో దారి వదిలాడు.

హనుమంతుడు గొప్ప గాయకుడు కూడా.