EPAPER

iQOO Neo 10 Series: యమ స్పీడుమీదున్న ఐక్యూ.. ఈసారి మరో రెండు ఫోన్లతో వచ్చేస్తుంది..!

iQOO Neo 10 Series: యమ స్పీడుమీదున్న ఐక్యూ.. ఈసారి మరో రెండు ఫోన్లతో వచ్చేస్తుంది..!

iQOO Neo 10 series Launch Soon: Vivo సబ్ బ్రాండ్ iQOO ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఫోన్లు లాంచ్ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. గతేడాది చైనీస్ మార్కెట్లో iQOO 12 సిరీస్, iQOO నియో 9 సిరీస్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఐక్యూ బ్రాండ్ తన రాబోయే సిరీస్‌ కోసం పని చేస్తోంది. ఇందులో భాగంగానే చైనా మార్కెట్‌లో నియో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై పనిచేస్తోందని ఇటీవల వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను ఒక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి లీక్ చేశాడు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


iQOO Neo 10 series

టిప్ స్టర్ తాజాగా దీని లైనప్‌ గురించి కొన్ని విషయాలు లీక్ చేశాడు. నెక్స్ట్ జెన్ iQOO నియో సిరీస్ సబ్-ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కొత్త నియో సిరీస్ తర్వాత వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాబట్టి ఈ సంవత్సరం iQOO Neo 10 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత iQOO 13 సిరీస్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే Neo 10 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3పై, అదేసమయంలో దాని Neo 10 Pro వేరియంట్‌ డైమెన్సిటీ 9400పై ఆధారపడి ఉంటుందని టిప్‌స్టర్ స్పష్టంగా పేర్కొనలేదు. టిప్‌స్టర్ Weibo పోస్ట్‌లో iQOO Neo 10 మోడల్‌లు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్న నియో 9 సిరీస్‌లా కాకుండా మెటల్ మిడిల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయని వెల్లడించారు.

Also Read: రూ.9,999లకే కొత్త 5జీ ఫోన్.. ఇవాళే సేల్ స్టార్ట్.. ఈ ఆఫర్లు పొందొచ్చు..!

Neo 10 మోడల్‌లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే సిలికాన్ బ్యాటరీ అమర్చబడుతుందని అన్నారు. ఇది 100W కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపాడు. అదే సమయంలో 6,000mAh+ బ్యాటరీతో రావచ్చని తెలిపారు. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లే అల్ట్రా-నారో బెజెల్స్‌తో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఐ ప్రొటెక్షన్ అండ్ బెటర్ డిస్‌ప్లే క్వాలిటీని అందిస్తుంది.

గత సంవత్సరం లాంచ్ అయిన iQOO నియో 9 సిరీస్‌లో నియో 9 అండ్ నియో 9 ప్రో అనే రెండు మోడల్‌లు ఉన్నాయి. నియో 9 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఇవ్వబడింది. నియో 9 ప్రోలో డైమెన్షన్ 9300 ప్రాసెసర్ ఇవ్వబడింది. నియో 9 ప్రో చైనాలో మాత్రమే లాంచ్ అయిది. అయితే నియో 9 భారతదేశంలో iQOO నియో 9గా రీబ్రాండ్ చేయబడింది. ప్రస్తుతం నియో 10 సిరీస్ గ్లోబల్ లాంచ్ గురించి ఇంకెలాంటి సమాచారం లేదు.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×