HAL Recruitment 2024: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 25 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు..
ఖాళీల సంఖ్య: 25
1. డిప్లొమా టెక్నీషియన్ D-6:06 పోస్టులు
2. ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ D-6:17పోస్టులు
3. ఆపరేటర్ C-5:02 పోస్టులు
విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ వర్క్స్, స్ట్రక్చర్, గ్రైండర్ ,ఎలక్ట్రికల్ మొదలైనవి.
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.7.2024 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు గ్రూప్- డి పోస్టులకు రూ. 48,764, గ్రూప్- సి పోస్టులకు 46,796 ఇస్తారు.
పని ప్రదేశాలు: బెంగళూర్, జామ్ నగర్, గోరఖ్పుర్, అంబాలా, భుజ్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
Also Read: సుప్రీంకోర్టులో జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలు.. అర్హతలివే
దరఖాస్తు ఫీజు: రూ. 200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ అప్రెంటిస్లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 30.08. 2024.
రాతపరీక్ష: 22.09.2024.