EPAPER

Yuvraj Singh Biopic: మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌.. త్వరలోనే షూటింగ్!

Yuvraj Singh Biopic: మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌.. త్వరలోనే షూటింగ్!

Yuvraj Singh Biopic: ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ కూడా త్వరలో తెరకెక్కనుంది.  భారత క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ తెరపై సందడి చేశాయి. క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, మాజీ పేసర్ జులన్ గోస్వామి, మాజీ మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్స్ వచ్చాయి. తాజాగా, మరో విధ్వంసక క్రీడాకారుడు, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ఈ బయోపిక్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, రవి భాగ్ చందక నిర్మించనున్నారు. అయితే ఈ బయోపిక్‌కు సంబంధించిన పేరు ఖరారు చేయలేదు. అలాగే ఈ బయోపిక్‌లో నటించనున్న హీరో, హీరోయిన్, దర్శకత్వం వహిస్తారనే వివరాలను సైతం వెల్లడించలేదు. అయితే, ఈ బయోపిక్ వివరాలను చెప్పకుండా నిర్మాతలు అనౌన్స్ మెంట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువరాజ్ సింగ్‌తో ఈ ఇద్దరు నిర్మాతలు దిగిన ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

కాగా, టీ సిరీస్ ప్రభాస్ ‘సాహూ’, అజయ్ దేవగన్ ‘తానాజీ’, షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’, రణబీర్ కపూర్ ‘యనిమల్’ వంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను అందించింది. ఇప్పుడు ఇదే బ్యానర్‌లో యువరాజ్ సింగ్ బయోపిక్ రానున్న నేపథ్యంలో ఇటు క్రికెట్ అభిమానులతోపాటు సినిమా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో యువరాజ్ బయోపిక్‌పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.


సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్..13ఏళ్ల వయస్సులో పంజాబ్ అండర్ 16 తరఫున ఆడారు. ఆ తర్వాత 2000లో అండర్ 19 వరల్డ్ కప్ ఆడారు. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు తీసుకున్నాడు. అదే ఏడాది కెన్యాపై అరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరోవైపు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007 టీ 20 వరల్డ్ కప్ విజయంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Also Read:  రోహిత్ శర్మ ఒక గజని.. మాజీ బ్యాటింగ్ కోచ్

2011లో క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ సింగ్.. అధైర్యపడకుండా పోరాటం చేసి జయించాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ఎంతోమందికి దిక్సూచిగా మారాడు. మొత్తం 40 టెస్టులు 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×