EPAPER

Jio Prepaid Recharge Plans: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. మొత్తం ఎన్ని.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

Jio Prepaid Recharge Plans: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. మొత్తం ఎన్ని.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

Jio Prepaid Recharge Plans: స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఇంటర్నెట్ అధికంగా వాడే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఒకప్పుడు యాభై లేదా వంద రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే టాక్ టైం + తక్కువ ఎంబీ లేదా జీబీల్లో ఇంటర్‌నెట్ పొందేవారు. కానీ ఇప్పుడంతా అన్‌లిమిటెడ్ అయిపోయింది. అందువల్లనే ప్రతి ఒక్కరూ ఫోన్ కొని అందులో ఒకటి రెండు సిమ్‌లు మెయింటైన్ చేస్తున్నారు. డేటా అయిపోయిన వెంటనే వేరే సిమ్ కార్డు నుంచి డేటా ఆన్ చేసుకుంటున్నారు.


అది కూడా అయిపోతే వెంటనే డేటా ప్లాన్ వేసుకుంటున్నారు. ఇలా ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో ప్రముఖ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అధికంగా తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. అందువల్ల వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగిలినంతపనైంది. దీంతో చాలామంది ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. ఇదే క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

తాజాగా మరో టెలికాం కంపెనీ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రముఖ టెలికాం సంస్థ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.3999 రీఛార్జ్‌ ప్లాన్‌ వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.


Also Read: బుర్రపాడు రా సామీ.. రూ.6లకే 2జీబీ డేటా.. ఏకంగా 395 రోజుల పాటు..!

రూ.3999

జియో అందిస్తున్న రూ.3999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. దీని కారణంగా ప్రతి నెలా రీఛార్జ్ ప్లాన్‌లతో విసుగుచెందేవారికి ఈ ఏడాది ప్లాన్ ఉపశమనం అందిస్తుంది. కాగా ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ పొందుతారు. అలాగే రోజువారీ 100 SMS, రోజువారీ 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో జియో వినియోగదారులు 912.5GB డేటాను సొంతం చేసుకుంటారు. అంతేకాదండోయ్ ఇంకా ఉన్నాయి. 5G స్మార్ట్‌‌ఫోన్ నెట్‌‌వర్క్ కోసం అన్‌లిమిటెడ్‌ 5G డేటా అందుతుంది. అలాగే OTT సబ్‌స్క్రిప్షన్‌‌ను పొందొచ్చు. ఇవి మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా యాప్‌లను ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మరెన్నో ప్లాన్‌లు ఉన్నాయి.

రూ.949

జియో నుంచి మరికొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో రూ.949 ప్లాన్ ఒకటి. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, డైలీ 100 SMSలు పొందొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

రూ.1029

జియో వినియోగదారులు రూ.1029లతో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డైలీ 100 SMSలను పొందవచ్చు. అలాగే డైలీ 2GB హైస్పీడ్‌ డేటాను లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ 5G ఇంటర్నెట్‌ను పొందుతారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది.

Also Read: ఈ సిమ్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే వార్త.. రూ.197 రీఛార్జ్‌ ప్లాన్‌తో 70 రోజుల వ్యాలిడిటీ..!

రూ.1049

రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయం, రోజువారీ 100 SMSలు పొందవచ్చు. అంతేకాకుండా డైలీ 2GB డేటా కూడా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటా వినియోగించుకోవచ్చు. అలాగే Sony LIV, ZEE5 ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.1299

జియో అందిస్తున్న మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.1299. ఈ ధరతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లు పొందవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. అందువల్ల ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ధరలను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×