EPAPER

Kavitha bail petition: కవితకు బెయిల్‌ వచ్చేనా.. సుప్రీంకోర్టులో విచారణ.. టెన్షన్‌లో బీఆర్ఎస్ నేతలు

Kavitha bail petition: కవితకు  బెయిల్‌ వచ్చేనా.. సుప్రీంకోర్టులో విచారణ.. టెన్షన్‌లో బీఆర్ఎస్ నేతలు

Kavitha bail petition updates(Telangana news live): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.


ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి ఆమెని తరలించింది ఈడీ. మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం ఆమెకు జుడ్యీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కవితను ఒకవైపు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మరోవైపు సీబీఐ కస్టడీకి తీసుకున్నాయి.

ఐదు నెలలుగా తీహార్ జైలులోనే ఉన్నారు కవిత. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించడం బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగిపోయింది. ఈసారైనా కవితకు బెయిల్ వస్తుందని కొండంత ఆశతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.


ALSO READ: ఒలింపిక్స్‌కు హైదరాబాద్ వేదికగా మారాలి: సీఎం రేవంత్

ఒక్కసారి వెనక్కి వెళ్తే.. బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీష్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లతో సంప్రదింపులు జరిపారు. వారి మధ్య ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయో తెలీదు.  ఇదే సమయంలో కవిత బెయిల్ కోసం ఆ పార్టీ నేతలు రాజకీయ ప్రయత్నాలు చేసినట్టు జోరుగా వార్తలు వచ్చాయి. ఈసారైనా కవితకు బెయిల్ వస్తుందని కొండంత ఆశతో ఉన్నారు కారు పార్టీ నేతలు.

ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం జైలులో ఉన్నారు. రీసెంట్ ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రమే పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో కవితకు కూడా బెయిల్ రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మరి న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×