EPAPER

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్ రాజీనామా, అదే దారిలో మరొకరు..

Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు డైరెక్టర్ రాజీనామా, అదే దారిలో మరొకరు..

Bangladesh Cricket Board Director Resigns(Sports news today): బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా దేశమంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ సెగ తాజాగా క్రికెట్‌కి తాకింది. దేశంలో ప్రభుత్వ మార్పు కారణంగా బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జలాల్ యూనుస్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆపరేషన్స్ ఛైర్యన్ కూడా తన పదవి నుండి వైదొలుగుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోమం కారణంగా యూనస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.


బంగ్లాదేశ్‌ క్రికెట్ ప్రయోజనాల కోసం తాను బోర్డు డైరెక్టర్ పదవికి రిజైన్ చేశానని యూనస్ ఆ దేశ ప్రముఖ ఛానల్‌కి వివరాలను వెల్లడించారు. బంగ్లాదేశ్ హసీనా సర్కార్ కుప్పకూలి నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దేశ క్రికెట్‌ బోర్డు నుంచి వైదొలిగిన తొలి డైరెక్టర్‌గా యూనస్ నిలిచిపోనున్నాడు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్ కూడా అతి త్వరలో రిజైన్ చేయనున్నట్టు తెలుస్తోంది. దేశ ప్రయోజనాలకై సహకరించే ఉద్దేశంతో ఈ డెసీషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎప్పటికైనా నిజం గెలవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా: రెజ్లర్‌ వినేష్‌


దీని కారణంగా ఈ ఏడాది జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తాజాగా బంగ్లాలో అల్లర్లు నెలకొన్న నేపధ్యంలో బంగ్లాలో మహిళల వరల్డ్‌కప్ నిర్వహణపై సందిగ్థత నెలకొంది. ప్రపంచకప్ నాటికి ఈ పరిస్థితులు చక్కబడకపోతే ఇక్కడి నుంచి ఈ వేదిక మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా పరిస్థితులు చక్కబడాలని భారత్‌తో సహా ఇతర దేశాలు సైతం కోరుకుంటున్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×