EPAPER

Manu Bhaker’s Coach: ఆటలపై రాజకీయాలు, సెలక్షన్ పాలసీ.. మనుబాకర్ కోచ్ ఆగ్రహం

Manu Bhaker’s Coach: ఆటలపై రాజకీయాలు, సెలక్షన్ పాలసీ..  మనుబాకర్ కోచ్ ఆగ్రహం

Manu Bhaker’s Coach: పారిస్ ఒలింపిక్స్ ఏం జరిగింది? ఎందుకు భారత ఆటగాళ్లు రాణించలేకపోయారు? గతంలో కంటే పతకాలు తగ్గడం వెనుక అసలేం జరిగింది? ఒలింపిక్స్ వ్యవహారంపై ఇప్పుడిప్పు డే ఎందుకు నోరు విప్పుతున్నారు? అసలు స్పోర్ట్స్ శాఖ ఏం చేస్తోంది? సంఘాలకు అప్పగించి సైలెంట్‌గా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


పారిస్ ఒలింపిక్స్ ముగిశాయి. భారత ఆటగాళ్లు కొన్ని పతకాలు తీసుకొచ్చారు. వాటితోనే మన పాలకు లు హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాదు 2038 నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. నిర్వహణ ఓకే.. మరి ఆటగాళ్లు మాటేంటి? ఆయా స్పోర్ట్స్ సంఘాల మాటేంటి? అందులో రాజకీయాలు తారాస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా పారిస్ ఒలింపిక్స్ డబుల్ షూటర్ మనుబాకర్ గెలుపు వెనుక విశేషమైన కృషి చేశారు కోచ్ జస్పాల్ రాణా. లేటెస్ట్‌గా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ షూటింగ్ ఫెడరేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ఎంపికపై ఒలింపిక్ ఫెడరేషన్ పద్దతి పాటించలేదని కాసింత ఆగ్రహం వ్యక్తంచేశారు. చీటికి మాటికీ పాలసీలో మార్పులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.


ALSO READ: విరాట్ కొహ్లీకి.. పదహారేళ్లు!

ప్రతీ ఆరునెలలకు పాలసీ మారుస్తోందని ఆరోపించారు జస్పాల్ రాణా. ఈ వ్యవహారంపై ఆ శాఖ మంత్రిని కలిసి, జరుగుతున్న తతంగాన్ని వివరించామని వెల్లడించారు. ముఖ్యంగా ఫెడరేషన్ నుంచి పాలసీని తెచ్చుకుని చూడాలని కోరినట్టు తెలిపారు. బాగుందా? లేదా అనేదానిపై మాట్లానని, ఆ పాలసీకి కట్టబడి ఉంటామన్నారు. మన దగ్గర సరైన షూటర్లు ఉన్నారని, వారి ప్రదర్శనను పారిస్ ఒలింపిక్స్‌లో చూశారని వివరించారు.

షూటర్ సౌరబ్ చౌదరి, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ జితురాయ్ ఎక్కడ? వీరి గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. తృటిలో పతకం చేజార్చుకున్న అర్జున్ బబుతా గురించి అస్సలు చర్చ లేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఫెడరేషన్‌కు యాంటీగా ఉన్నట్లు కాదని, తీసుకొచ్చిన పాలసీ నిలకడగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పతకాలు సాధించిన ఆటగాళ్లు తర్వాత కాలంలో కనిపించలేదన్నారు. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా సరైన వ్యవస్థ ఉండాలన్నదే తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

ఈ లెక్కన ఫెడరేషన్‌లో ఏదో జరుగుతోందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు కోచ్ జస్పాల్ రాణా. ఇది ఒక వైపు మాత్రమే.. వివిధ క్రీడా సంఘాల విషయానికి వద్దాం. అందులోనూ రాజకీయాలు ఉన్నాయని గతంలో చాలామంది విమర్శించారు. సరైన ఆటగాళ్లకు అవకాశాల్లేవని, పైరవీలు చేసినవాళ్లు బయటకు వస్తున్నారని గొంతెత్తారు కూడా. ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమవుతున్న కేంద్ర సర్కార్, పనిలో పనిగా సంఘాలు, ఫెడరేషన్లపై దృష్టి సారిస్తే దేశానికి మరిన్ని పతకాలు వస్తాయని అంటున్నారు క్రీడాభిమానులు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×