EPAPER

How to tie Rakhi: రాఖీని ఎలా కట్టాలో తెలుసా..?

How to tie Rakhi: రాఖీని ఎలా కట్టాలో తెలుసా..?

How to tie A Rakhi that Your Brother: రేపు రాఖీ పండుగ. ఈ పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ రాఖీ పండుగను శ్రావణమాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. సోదరసోదరీమణుల ప్రేమకు ప్రతీకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. రాఖీ పండుగ రోజు అక్కాచెల్లెల్లు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి దీర్ఘాయుష్షుతో జీవించు అంటూ ఆశ్వీర్వదిస్తారు. రాఖీ కట్టినందుకు తమ అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులను అందజేస్తారు. పలువురు డబ్బులు ఇస్తుంటారు. ఇంకొంతమంది విలువైన వస్తువులను తమ సోదరీమణులకు బహుమతులుగా ఇస్తుంటారు. అయితే, రాఖీని ఎలా కట్టాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. నియమాలు ఏమైనా ఉంటాయా అని తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అయితే,..


Also Read:  రాఖీ రోజు మీ సోదరికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి

రాఖీని ఏ విధంగా కట్టాలి అంటే…


1. రాఖీ పండుగ సందర్భంగా సోదరులు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి పూజ చేస్తారు.

2. తమ సోదరీమణులతో రాఖీ కట్టించుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

3. సోదరీమణులు కూడా ఉదయాన్నే లేచి స్నానమాచరించి, దేవుడికి పూజలు చేస్తారు.

4. అనంతరం రాఖీ కట్టేందుకు తమ సోదరులను పిలుస్తారు.

5. ఇంట్లో నేలపైన కూర్చోపెట్టి వారికి ముందుగా నుదుటన బొట్టు పెడుతారు.

6. ఆ సమయంలో సోదరులు తలకు రుమాలు కట్టుకుంటారు.

7. ఆ తరువాత తమ సోదరుల కోసం కొని తెచ్చుకున్న రాఖీని వారి కుడి చేతికి కడుతారు.

8. అనంతరం తలపై అక్షింతలు వేసి, తమ సోదరులకు దీర్ఘాయుష్షు ఇవ్వాలంటూ దేవుళ్లను ప్రార్థిస్తారు సోదరీమణులు.

9. ఆ వెంటనే ఒకరినొకపు స్వీట్లు తినిపించుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

10. తమ సోదరీమణుల కోసం తెచ్చిన బహుమతులు వారికి అందజేస్తారు అన్నాదమ్ముళ్లు.

11. కొంతమంది బట్టలు పెడుతుంటారు. ఇంకొంతమంది నగలు పెడుతుంటారు.

12. చాలామంది అయితే, తమకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు డబ్బులను బహుమతిగా ఇస్తుంటారు.

13. ఆ తరువాత తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు అన్నాదమ్ముళ్లు.

14. తమ అక్కాచెల్లెళ్లకు దీర్ఘాయుష్షు ఇవ్వాలంటూ దేవుళ్లను ప్రార్థిస్తారు సోదరులు.

15. ఈ విధంగా రాఖీని కడుతారు.

Also Read: శ్రావణ మాసంలో మాంసం తినకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

అయితే, ఈసారి పౌర్ణమితోపాటు భద్రుడి నీడ కూడా ఉంటుందని, ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కారం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. సోదరులకు రాఖీ కట్టడానికి నియమాలు ఉన్నట్టే.. కట్టిన రాఖీని తీయడానికి కూడా పలు నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి రాఖీ పండుగ అయిపోయిన తరువాత కట్టిన రాఖీని ఏం చేయాలో చాలామందికి తెలియదు. అయితే, కొంతమంది రాఖీ పండుగ తరువాత ఆ రాఖీని తీసివేసి ఎక్కడపడితే అక్కడ పారవేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని, ఇలా చేయడం వల్ల దుష్ర్పభావాలు కలుగుతాయని చెబుతున్నారు. తీసివేసిన ఆ రాఖీని సోదరికి సంబంధించిన వస్తువుల దగ్గర పెట్టాలని, లేదా దేవుళ్ల ఫొటోల వద్ద, ఇంట్లో ఉన్న దేవుడి రూంలో భద్రపరచాలని చెబుతున్నారు. ఒకవేళ రాఖీని తీసివేసే సమయంలో ఆ రాఖీ విరిగిపోతే దానిని పరేయకుండా ప్రవహించే నీటిలో వేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×