EPAPER

Chicken Prices: భారీగా తగ్గిన చికెన్ ధరలు..కేజీ ఎంతంటే?

Chicken Prices: భారీగా తగ్గిన చికెన్ ధరలు..కేజీ ఎంతంటే?

Chicken Prices Dropped in Telangana: నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత నెలలో విపరీతంగా పెరిగిన చికెన్ ధరలు..గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. శ్రావణ మాసం ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడడంతో చికెన్ రేట్ అమాంతం దిగొచ్చింది. ఇక ఆదివారం వస్తే..చాలామంది ముక్కలేనిది ముద్ద దిగదు అనుకునే వారు.. చికెన్ రేటు తగ్గడంతో షాపుల ముందు క్యూ కడుతున్నారు.


ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ లైవ్ కోడి ధర రూ.110 నుంచి రూ.120 విక్రయిస్తున్నారు. స్కిన్ లేకుండా రూ.150 నుంచి రూ.160 ఉండగా..స్కిన్ చికెన్ ధర రూ.130 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతకొంతకాలంగా ఉన్న ధరలలో ఇదే కనిష్ట ధర కావడం విశేషం.

అలాగే, హిందువులు శ్రావణమాసంలో ఎంతో నిష్టగా ఉంటారు. వత్రాలు, ఉపవాసాలు ఉండడంతో నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో చికెన్ తినే వారి సంఖ్య క్రమంగా తగ్గుమఖం పట్టింది. దీంతో చికెన్ ధరలపై ఎఫెక్ట్ పడింది. అయితే కోడిగుడ్డు ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ. 5 అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా, మటన్ ధర కేజీ రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది.


Also Read: హైదరాబాద్ లో 25 పబ్బుల్లో తనిఖీలు.. పలువురికి పాజిటివ్

మరోవైపు, కోళ్లుఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని విక్రయించాల్సి ఉంటుంది. లూని సమక్షంతో వాటికి పెట్టే దాణ ఖర్చు ఎక్కువకావడంతోపాటు అనోరోగ్య బారిన పడే అవకాశం ఉంది. దీంతో మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో పాటు భారీగా కోళ్లు రావడంతో చికెన్ ధరలు అమాంతం తగ్గుముఖం పట్టాయి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×