EPAPER

How to Prevent Obesity: ప్రపంచంలో పెరుగుతున్న ఒబెసిటీ సమస్యలు.. చెక్ పెట్టడం ఎలా?

How to Prevent Obesity: ప్రపంచంలో పెరుగుతున్న ఒబెసిటీ సమస్యలు.. చెక్ పెట్టడం ఎలా?

How to prevent obesity Healthy Eating and More: ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, మనం తినే ఆహారంలో ,సరైన పోషకాలు లేకపోవడం, అలాగే వంశపారపర్యం వల్లన కూడా ఊబకాయం సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఖలీద్ విషయంలో లాగా అందరికి దాతలు ముందుకు రాకపోవచ్చు.. పెద్ద పెద్ద అపరేషన్లు చేయించే స్తోమతలేకపోవచ్చు. కానీ పట్టుదల ఉంటే ఊబకాయం నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు.. అసలు ఒబెసిటి ఎలా వస్తుంది.. ? దానికి చెక్ ఎలా పెట్టొచ్చు.


మొత్తం జనాభాలో 38 శాతం ఒబేసిటిప్రపంచంలో అతి బరువైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఖలీద్.. ఎట్టకేలకు బరువు తగ్గారు. సౌదీ అరేబియా రాజు కింగ్ అబ్దుల్లా సాయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ ప్రపంచంలోకి ఓ సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టాడు. కానీ చాలా మంది శరీర బరువు బరువు ఎక్కువగా ఉన్నవారు కొవ్వును కరిగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చాలా మంది ఎక్కువగా తినడం వల్లనే లావు పెరుగుతామని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కేవలం అతిగా తినడం వల్ల లావు అవ్వరని నిపుణులు చెబుతున్నారు.

లావు తగ్గడం కోసం చాలా మంది డైటింగ్ ద్వారా బరువు తగ్గాలని తెగ ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది అయితే వ్యాయామం చేయడం వల్ల లేదా జిమ్‌కు వెళ్లడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. ఈ బిజీ లైఫ్ లో వ్యాయామం కూడా సరైన టైమ్ లో చేయకపోవడం.. సరైన సమయానికి తినకపోవడం ప్రధాన సమస్య. ఈ కాలంలో చాలామంది ఉద్యోగాల్లో భాగంగా నైట్ షిఫ్ట్‌‌లు చేస్తున్నారు. మరి కొంత మంది అర్ధరాత్రి వరకు ఫోన్స్ వాడుతున్నారు. దీంతో దీర్ఘకాలికంగా మిడ్ నైట్ వరకు మెలకువగా ఉండడం వల్ల హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.


ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి వల్ల, టైం లేకపోవడం వల్ల శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి డైలీ నడక, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాదు జంక్ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు.. రోజు భోజనం చేసేటప్పుడు క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల ఊబకాయం వస్తుంది.

టీవీ చూస్తూ తినడం కొంత మందికి అలవాటు ఉంటుంది. టీవీ చూసినప్పుడు ఎంత తింటున్నామో ఏమి తింటున్నామో కూడా తెలియదు. దీనివల్ల అతిగా తిని బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మరి కొంత మంది వర్క్ ప్రెజర్ వల్ల కొంతమంది తినకుండా ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తర్వాత ఆకలి వేసినప్పుడు ఒకేసారి ఎక్కువగా తింటారు. ఇలా చేయడం ద్వారా కూడా ఊబకాయం సమస్యలు వస్తాయి. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరం బరువు అంతకంతకు పెరుగుతూ వస్తుంది.

Also Read: రాఖీ రోజు మీ సోదరికి ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి

ఇప్పటికే ప్రపంచం ఒబేసిటీ సమస్యతో బాధపడుతోంది. మొత్తం జనాభాలో 38 శాతం ఊబకాయులు లేదా అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 12 ఏళ్లలో 400 కోట్ల మంది.. అంటే 51 శాతం మందికి కష్టాలు తప్పవు. ప్రస్తుతం ప్రతి ఏడుగురిలో ఒకరు ఊబకాయం బారిన పడ్డారు. ఈ సమస్యను అదుపు చేయకుంటే 2035 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు ఒబెసిటీతో బాధపడటం ఖాయం.

ఒబెసిటీ వల్ల ఆరోగ్య, సామాజిక, ఆర్థికపరంగా పడే భారం అంతా ఇంతా కాదు. ఊబకాయ సమస్య వల్ల పడే ఆర్థిక భారం ప్రపంచ జీడీపీలో 3 శాతం వరకు ఉండొచ్చని అంచనా. అంటే ఆ మొత్తం 4 ట్రిలియన్ డాలర్లకుపైనే. ఈ విషయంలో ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు తక్షణమే మేల్కొనాలని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ఎన్నోసార్లు సూచించింది. దిద్దుబాటు చర్యలు ఇప్పటి నుంచే చేపట్టకపోతే.. ఊబకాయం ప్రపంచానికి పెను సమస్యగా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు

ఉబకాయం అనేది నిజానికి ప్రమాదకరమైన సమస్యగానే భావిస్తారు నిపుణులు.. అది నిజం కూడా.. ఊబకాయంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోవడం వల్ల పొట్ట, నడుము చుట్టూ ఎక్కువగా కొవ్వు చేరుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోనూ ఇలా కొవ్వు చేరడటం వల్ల బరువు పెరుగుతాం. దీనిని బీఎంఐలో కొలుస్తారు. మన ఎత్తు, బరువు ఆధారంగా బీఎంఐ ఎంత అనేదీ నిర్థారణ అవుతుంది. బీఎంఐ 30కి చేరితే ఊబకాయుల కేటగిరీలోకి చేరినట్టే. అధిక బరువు వల్ల కేన్సర్, హార్ట్ ఇష్యూతో పాటు ఇతర రోగాలబారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఊబకాయానికి చెక్ పెట్టడం మన చేతుల్లో పనే.. అందులో లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి అలవాట్లతో ఈ అధిక బరువు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. సంకల్పముంటే ఖలీద్ లా మనమూ ఆపరేషన్ లేకుండా ఊబకాయం తరిమికొట్టొచ్చు.. అంతేనా ముందు జాగ్రత్తతో ఆహరపు అలవాట్లు మార్చుకుంటే దానిని మన దరిచేర్చకుండా వెళ్లగొట్టొచ్చు.

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×