EPAPER

Vinesh Phogat: అక్కడ గోల్డ్ మెడల్ ఇవ్వలేదు.. కానీ నా దేశప్రజలు ఇచ్చారు: వినేశ్ ఫోగట్

Vinesh Phogat: అక్కడ గోల్డ్ మెడల్ ఇవ్వలేదు.. కానీ నా దేశప్రజలు ఇచ్చారు: వినేశ్ ఫోగట్

Vinesh Phogat India Arrival Highlights:  భారత రెజ్లర్ ఎవరంటే ఇప్పుడందరూ వినేశ్ ఫోగట్ పేరే చెబుతారు. అంత క్రేజ్ తనకి వచ్చింది. ఇన్నేళ్లుగా తను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంది. కానీ ఏనాడు రాని పేరు ఇప్పుడు వచ్చింది. అది గెలిస్తే కాదు, ఓడిపోతే వచ్చింది.. అదే గొప్ప విషయమని క్రీడాలోకం కొనియాడుతోంది.


ఇంతకీ విషయం ఏమిటంటే, తను ఢిల్లీ విమానాశ్రయం దిగిన తర్వాత అభిమానులను ఉద్దేశించి మాట్లాడింది. మీ అభిమానమే నాకు కొండంత అండ అని తెలిపింది. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.

నిజానికి నాకు అక్కడ గోల్డ్ మెడల్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ నా భారతదేశం, నా ప్రజలు గోల్డ్ మెడల్ ఇచ్చారని ఉద్వేగంగా తెలిపింది. మీ ఆదరాభిమానాలు నాకు వెయ్యి గోల్డ్ మెడల్స్ కన్నా ఎక్కువని పేర్కొంది.  విమానాశ్రయంలో ఘన స్వాగతం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లింది.


Also Read: ఏమని వర్ణించను.. నచ్చిన కెప్టెన్లపై బుమ్రా

ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఫైనల్ కు చేరిన మొట్టమొదటి మహిళా రెజ్లర్ గా వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. కానీ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఇప్పుడిదే అంశం భారత దేశంలోనే కాదు, ప్రపంచంలోని క్రీడాభిమానుల గుండెలు పగిలేలా చేసింది.

అయితే ఒలింపిక్స్ లో ఎందరో దురదృష్టవంతులున్నారు. వారిలో ఒకరుగా చరిత్రలో వినేశ్ ఫోగట్ నిలిచిపోవడం బాధాకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×