EPAPER

X operations in Brazi : బ్రెజిల్ లో ఎక్స్ కార్యకలాపాలు బంద్..మస్క్ సంచలన నిర్ణయం

X  operations in Brazi : బ్రెజిల్ లో ఎక్స్ కార్యకలాపాలు బంద్..మస్క్ సంచలన నిర్ణయం

Elon Musk’s X to shut operations in Brazil amid bitter legal fight: ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ ,వాట్సాప్ లతో సహా ఎక్స్ (ట్విట్టర్) కూడా ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం అన్ని దేశాధినేతలతో సహా సామాన్యులు కూడా ఎక్స్ యాప్ ను అధికారికంగా ఉపయోగిస్తున్నారు. అయితే బ్రెజిల్ దేశంలో పరిస్థితి వేరేరకంగా ఉంది. అక్కడ న్యాయవ్యవస్థ ఎక్స్ ఖాతాలపై ఆంక్షలు విధించింది. బ్రెజిల్ దేశపు అత్యున్నత న్యాయస్థానం జడ్జి సోషల్ మీడియాకు కొన్ని ఆంక్షలు జారీచేశారు. ఆ ఆంక్షలకనుగుణంగా ఇకపై అక్కడి సోషల్ మీడియా పనిచేయాలని ..కొన్ని సెన్సార్ మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిలో ఎక్స్ కార్యకలాపాలు ఒకటి. ఇకపై ఎక్స్ కార్యకలాపాలు తప్పనిసరిగా వారి మార్గదర్శకాలు పాటించాలని..అందుకు అనుగుణంగా పనిచేయకుంటే ఎక్స్ నిర్వాహకులకు లీగల్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు ఆ న్యాయమూర్తి.


కక్ష సాధింపులా?

కేవలం బ్రెజిల్ దేశానికి చెందిన కంపెనీకి రహస్యంగా..పర్సనల్ గా నోటీసులు జారీ చేశారు. దీనితో ఆగ్రహించిన ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బ్రెజిల్ దేశంలో ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం బ్రెజిల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయంతోనే తాను కూడా ఇలాంటి ప్రకటన చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చారు మస్క్. కేవలం తమ కంపెనీని ఉద్దేశించి మాత్రమే న్యాయమూర్తి నోటీసులు ఇవ్వడమేమిటని..దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఇవ్వకుండా సీక్రెట్ గా తమ కంపెనీపై కక్ష సాధించడం కోసమే ఇలా చేస్తున్నట్లు ఉందని మస్క్ అన్నారు.


యూజర్ల ఖాతాలు సేఫ్

గతంలోనూ బ్రెజిల్ దేశంలో కొన్ని సందర్బాలతో ఎక్స్ ఖాతాలపై అక్కడి న్యాయవ్యవస్థ అనవసరంగా నోటీసులు ఇచ్చారని అన్నారు. వాటి వల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చిందని మస్క్ అన్నారు. అయితే ఈ విషయంలో బ్రెజిల్ దేశపు యూజర్ల ఎక్స్ ఖాతాలు ఇప్పుడున్నవి కొనసాగుతాయని..అవన్నీ యాక్టివ్ గానే ఉంటాయని మస్క్ పేర్కొన్నారు . ఇకపై ప్రత్యక్ష కార్యకలాపాలు మాత్రం ఉండవని అన్నారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని చెప్పారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×