EPAPER

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశివారికి డబ్బే డబ్బు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశివారికి డబ్బే డబ్బు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదుర్యే అవకాశం ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహాయం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిడి, శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.


మిథునం:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. ఇతరుల ప్రవర్తనతో ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఇతరులతో వాదనలకు వెళ్లపోవడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కర్కాటకం:
కర్కాటకరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించి న పనుల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించక కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండవచ్చు. ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగవచ్చు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అర్ధలాభం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో బంధువుల సహకారం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వ్యాపారులకు డబ్బే డబ్బు అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయాలు ఫలిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమతో కూడిన ఫలాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికనష్టం కలగవచ్చు. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్తాన చలనం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలు, కర్తవ్యాలు పెరుగుతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి ఆర్థిక వృద్ధి ఉంటుంది. కొన్ని సంఘటనలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. కుటుంబ బాధ్యతులు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. గొప్ప వ్యక్తులను కలుస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర విషయాల్లో కలగజేసుకోకపోవడం మంచిది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

Related News

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు ? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే..

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Big Stories

×